Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 1 2021 @ 07:20AM

Jammu and Kashmir:షోపియాన్‌లో ఎన్‌కౌంటర్‌..మిలిటెంట్ హతం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా రఖామా ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున మిలిటెంట్లు, కేంద్ర భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటరులో గుర్తుతెలియని మిలిటెంట్ ఒకరు మరణించాడు. రఖామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని అందిన సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు కేంద్ర భద్రతా జవాన్లతో కలిసి గాలింపు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున మిలిటెంట్లు కాల్పులు జరపగా, జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గుర్తుతెలియని మిలిటెంట్ మరణించాడని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కోసం కేంద్ర భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement