Abn logo
Sep 18 2020 @ 16:47PM

కారు నడుపుతూ నిద్రలోకి జారుకున్న డ్రైవర్.. చివరికి!

Kaakateeya

ఒట్టావా: కారు నడుపుతూ, ఆదమరిచి నిద్రపోయిన డ్రైవర్‌పై కెనడా పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను అతని లైసెన్స్‌ను 24 గంటలపాటు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. కెనడాలో ఉన్న అల్‌బర్టా ప్రావిన్స్‌లోని హైవేపై టెల్సా సెల్ఫ్ డ్రైవింగ్ కారు.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు రంగంలోకి దిగారు. బ్రిటిష్ కొలంబియా (కెనడాలోని ఓ ప్రావిన్స్)కు చెందిన 20 ఏళ్ల యువకుడు కారు నడుపుతూ ఆదమరిచి నిద్రపోయినట్లు గుర్తించారు. అంతేకాకుండా.. కారు ఆటోమెటిక్‌ మోడ్‌లోకి షిఫ్టై.. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిందని గ్రహించారు. ఈ నేపథ్యంలో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆ యువకుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను 24 గంటలపాటు సస్సెండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన పోలీసు అధికారి.. ఓ డ్రైవర్ కారు నడుపుతూ నిద్రపోయిన సంఘటన తన సర్వీస్‌లో ఎప్పుడూ చూడలేదన్నారు. అంతేకాకుండా అతడ్ని డిసెంబర్‌లో కోర్టులో హాజరుపర్చనున్నట్లు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement