Abn logo
Oct 22 2021 @ 23:53PM

టెస్లా లాబీయింగ్ ?

న్యూఢిల్లీ : పన్ను తగ్గింపు కోసం కేంద్రం వద్ద... ప్రముఖ కార్ల కంపెనీ ‘టెస్లా’ లాబీయింగ్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారత మార్కెట్‌లోకి రావడానికి...  పన్ను అంశాన్ని ముందే తేల్చుకోవాలని భావిస్తోంది. టెస్లా ఆరంగేట్రం గురించి ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య చర్చలు జరగవచ్చునని వినవస్తోంది. ఇందుకు సంబంధించి ప్రధాని కార్యాలయంతో గత నెలలోనే టెస్లా ఎగ్జ్సిక్యూటివ్‌లు చర్చలు జరిపినట్లుగా వచ్చినట్లుగా వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఇంపోర్టెడ్ కార్ల పైన భారత్ వంద శాతం ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తున్న విషయం తెలిసిందే.


భారత్‌లో టెస్లా కార్ల అంశం చాలా కాలంగా నలుగుతోందన్న విషయం తెలిసిందే. ఇక్కడ పన్నులు ఎక్కువగా ఉన్నాయని టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించారు. టెస్లా విద్యుత్తు కార్ల ఇండియా ఆరంగేట్రం చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. తాజాగా టెస్లా కార్ల అంశంపై నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయంగా మంచి ఆదరణ చూరగొన్న విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లాను భారత్‌లోనే తయారుచేయాలని రాజీవ్ కుమార్ కోరారు.