‘టెస్లా’... త్వరలోనే భారుత్‌కు...

ABN , First Publish Date - 2022-01-21T21:33:42+05:30 IST

మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ, పంజాబ్ సహా పలు రాష్ట్రాలు ఎలాన్ మస్క్‌ను కోరుతున్న విషయం తెలిసిందే.

‘టెస్లా’... త్వరలోనే భారుత్‌కు...

న్యూఢిల్లీ : మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను  ఏర్పాటు చేయాల్సిందిగా తెలంగాణ, పంజాబ్ సహా పలు  రాష్ట్రాలు ఎలాన్ మస్క్‌ను కోరుతున్న విషయం తెలిసిందే. కాగా... పన్ను మినహాయింపునిచ్చేందుకు కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది కూడా. అయితే... మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, లేదా విడిభాగాల యూనిట్ ఇక్కడే ఉండాలని కోరుతోంది. కాగా... టెస్లా మాత్రం... కారు’ మొత్తాన్ని చైనా నుండి దిగుమతి చేయాలని భావిస్తోంది. మోడీ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటోంది. ఇక టెస్లా కూడా... భారత్‌లో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాగా... ఆయా రాష్ట్రాలు యూనిట్ ఏర్పాటుకు అంగీకరించాయి. తాజాగా కేంద్రం... మస్క్‌కు మరో ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పరిణామాలిలా ఉండగానే...ఎలాన్ మస్క్  ఇటీవల చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలిలా ఉన్న నేపధ్యంలో... కేంద్ర బడ్జెట్ పై టెస్లా ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. భారత్‌లో దిగుమతి సుంకాల విషయానికి వస్తే విద్యుత్తు వాహనాలపై 60 శాతం పన్ను విధిస్తున్నారు. మొత్తంమీద... ఇటు ప్రభుత్వం ఒకింత పట్టు సడలిస్తోందని, అదే సమయంలో... టెస్లా కూడా ఒక మెట్టు దిగుతోందని వినవస్తోంది. ఈ క్రమంలోనే... టెస్లా... త్వరలోనే భారత్‌లోకి ప్రవేశించనుందన్న అభిప్రాయాలు కూడా సర్వత్రా వినవస్తున్నాయి. 

Updated Date - 2022-01-21T21:33:42+05:30 IST