ఓపెనింగ్‌కూ సిద్ధమే!

ABN , First Publish Date - 2020-02-15T09:27:18+05:30 IST

టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటే టెస్టుల్లో ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హనుమ విహారి చెబుతున్నాడు. ద్వితీయ శ్రేణితో కూడిన కివీస్‌ లెవెన్‌ ...

ఓపెనింగ్‌కూ సిద్ధమే!

టెస్టు బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి

స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ గాయం ఒక్కసారిగా భారత జట్టును సమస్యల్లో పడేసినట్టయింది. అతడి లేని లోటుతో ఇప్పటికే వన్డే సిరీ్‌సను కోల్పోయిన భారత్‌.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లోనూ ఎవరితో ఓపెనింగ్‌ చేయించాలో తేల్చుకోలేకపోతోంది. పోటీలో ఉన్న పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ వామ్‌ప లో డకౌట్‌లు కావడం టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు షాకిచ్చింది. ఈనేపథ్యంలో హనుమ విహారి ఈ బాధ్యత తీసుకునేందుకు సై అంటున్నాడు..


హామిల్టన్‌: టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కోరుకుంటే టెస్టుల్లో ఓపెనింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని హనుమ విహారి చెబుతున్నాడు. ద్వితీయ శ్రేణితో కూడిన కివీస్‌ లెవెన్‌ బౌలింగ్‌ను పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌ ఎదుర్కోలేక ఖాతా తెరవలేకపోయా రు. అటు రెగ్యులర్‌ ఓపెనర్‌ మయాంక్‌ చేసింది కూడా ఒక్క పరుగే. అయితే ఆరో నెంబర్‌లో బరిలోకి దిగిన విహారి మాత్రం శతకంతో ఆకట్టుకుని భారత్‌ పరువు కాపాడాడు. ఎక్స్‌ట్రా బౌన్స్‌, పేస్‌తో ఇబ్బంది పెట్టిన కివీస్‌ బౌలర్ల ధాటికి విహారి, పుజార మినహా అంతా విఫలమయ్యారు. దీంతో అసలైన మ్యాచ్‌లో వాగ్నర్‌, బౌల్ట్‌, హెన్రీ ధాటిని వీరు ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఈనేపథ్యంలో విహారి మీడియాతో మాట్లాడాడు. 


ఎక్కడైనా ఆడేస్తా..: ఓ ఆటగాడిగా నేను ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం గా ఉన్నాను. ప్రస్తుతానికైతే ఓపెనింగ్‌ విషయంలో ఎవరూ సంప్రదించలేదు. అయితే నేనింతకు ముందే ఓ విషయం స్పష్టం చేశాను. ఫలానా స్థానంలో ఆడాలని జట్టు కోరితే నేను వంద శాతం రెడీగా ఉంటాను.


విచారమేమీ లేదు: వరుసగా నాలుగు టెస్టుల్లో నేను తుది జట్టులో లేనందుకు చింతించడం లేదు. కొన్ని సార్లు ఐదుగురు బౌలర్లతో ఆడుతాం. ఇలా జట్టు వ్యూహాలకు తగ్గట్టు కాంబినేషన్‌ ఉంటుంది.  దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు.


అదనపు బౌన్స్‌ ఊహించలేదు: వామప్‌ మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్లు మాకు సవాల్‌ విసిరారు. నిజానికి ఎక్స్‌ట్రా బౌన్స్‌ను ఊహించకపోయినా నేను దీటుగానే ఆడాను. కివీస్‌ ‘ఎ’తో ఇక్కడ ఆడినప్పుడు బంతి ఇలా బౌన్స్‌ కాలేదు. అయితే తొలి టెస్టుకు నాకిది మంచి సన్నాహకం.


సిరీ్‌సకు ఇలాంటి పిచ్‌లే: కివీస్‌ బలం వారి పేసర్లే. అందుకే ఈ సిరీ్‌సలో ఇ లాంటి పిచ్‌లే ఉంటాయేమో. వారికి అనుభజ్ఞులైన లైనప్‌ ఉంది. నాకు తెలిసి ఎక్కువగా వారు షార్ట్‌ బాల్స్‌తో దాడి చేస్తారనుకుంటా. అదృష్టవశాత్తూ పుజార, నేను కొద్ది సమయం క్రీజులో గడపగలిగాం. ఈ వికెట్‌పై ఎక్కువ బంతులను వదిలేయమని పుజార నాకు సలహా ఇచ్చాడు. అదే పాటించి శతకం బాదాను.

Updated Date - 2020-02-15T09:27:18+05:30 IST