నిరోధంలో పరీక్ష

ABN , First Publish Date - 2020-10-19T05:53:10+05:30 IST

నిఫ్టీ గత వారం 12000 వరకు వెళ్లినా తదుపరి బలమైన రియాక్షన్‌లో పడి వారం కనిష్ఠ స్థాయిలో క్లోజయింది.

నిరోధంలో పరీక్ష

నిఫ్టీ గత వారం 12000 వరకు వెళ్లినా తదుపరి బలమైన రియాక్షన్‌లో పడి వారం కనిష్ఠ స్థాయిలో క్లోజయింది. 14 రోజుల అనంతరం ఏర్పడిన ఈ రియాక్షన్‌తో ర్యాలీకి తాత్కాలిక విరామం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రధాన ట్రెండ్‌ మాత్రం ఇప్పటికీ ఎగువకే ఉంది. 12000 వద్ద బలమైన స్వల్పకాలిక నిరోధం ఏర్పడింది. 11900, 12000 వద్ద బలంగా నిలదొక్కుకోవడం అవసరం. 

బుల్లిష్‌ స్థాయిలు : మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే నిరోధ స్థాయి 11900 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. ప్రధాన నిరోధం 12050. ఆ పైన మాత్రమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఏర్పడుతుంది.

బేరిష్‌ స్థాయిలు : భద్రత కోసం కనీసం రెండు రోజులు ప్రధాన మద్దతు స్థాయి 11650 కన్నా పైన నిలదొక్కుకోవడం తప్పనిసరి. అంతకన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత తప్పదు. ప్రధాన మద్దతు స్థాయి 11500. 

బ్యాంక్‌ నిఫ్టీ : ఈ సూచీ 24000 వద్ద ఏర్పడిన బలమైన రియాక్షన్‌తో 310 పాయింట్లు నష్టపోయి వారం కనిష్ఠ, గరిష్ఠ స్థాయిల నడుమన అనిశ్చితంగా ముగిసింది. మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే నిరోధ స్థాయి 23750 కన్నా పై న నిలదొక్కుకోవాలి. పై నిరోధం 24100. మద్దతు స్థాయి 23400 కన్నా దిగజారితే మరింత బలహీనత తప్పదు. ప్రధాన మద్దతు స్థాయి 23000. 

పాటర్న్‌ : మరింత అప్‌ట్రెండ్‌ కోసం 12050 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన రెసిస్టెన్స్‌ ట్రెండ్‌లైన్‌’’ను దాటాలి. 11650 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ కన్నా దిగజారితే స్వల్పకాలిక బలహీనత ఏర్పడుతుంది. మార్కెట్‌  ప్రస్తుతం 20, 50 డిఎంఏల కన్నా స్వల్పంగా పైన ఉంది. అంతకన్నా దిగువన స్వల్పకాలిక బలహీనత ముప్పు ఏర్పడుతుంది.

టైమ్‌ : ఈ సూచి ప్రకారం మంగళవారం తదుపరి రివర్సల్‌ ఉండవచ్చు. గత వారం మైనర్‌ టాప్‌ ఏర్పడినందు వల్ల ఈ వారంలో కన్సాలిడేషన్‌ లేదా మరింత కరెక్షన్‌ ఉండవచ్చు.


సోమవారం స్థాయిలు


నిరోధం : 11830, 11890 

మద్దతు : 11710, 11660


www.sundartrends.in

Updated Date - 2020-10-19T05:53:10+05:30 IST