ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-08-13T10:51:40+05:30 IST

కొవిడ్‌ బాధితులతో ప్రాథమిక సంబంధాలున్న వ్యక్తులను 5నుంచి 6రోజుల తర్వాత గుర్తించి పరీక్షలు చేసి చికిత్స అందించాలని రాష్ట్ర

ప్రైమరీ కాంటాక్టులకు పరీక్షలు నిర్వహించాలి

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ


భువనగిరి రూరల్‌, ఆగస్టు 12 : కొవిడ్‌ బాధితులతో ప్రాథమిక సంబంధాలున్న వ్యక్తులను 5నుంచి 6రోజుల తర్వాత గుర్తించి పరీక్షలు చేసి చికిత్స అందించాలని  రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ అన్నారు. బుధవారం ఆమె యాదాద్రి కలెక్టర్‌ అనితారామచంద్రన్‌తో కలిసి భువనగిరి శివారులోని ఓ హోటల్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా వైద్యాధికారుల సమావేశం లో పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రులతో పాటు ఎయిమ్స్‌, ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కొవిడ్‌-19 బాధితులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలకు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలన్నారు.


కరోనా బాధితులను ఆశా, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్లు ప్రతిరోజూ పర్యవేక్షించే లా వైద్యాధికారులు చొరవ చూపాలన్నారు. హైరిస్క్‌ కేసులను వైద్య ఆరోగ్య శా ఖాధికారులు ధ్రువీకరించాలని సూచించారు. కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ మాట్లాడుతూ మెడికల్‌ ఆఫీసర్లు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌ కాల్‌సెంటర్‌ నుంచి వచ్చిన ఫోన్‌ కాల్స్‌కు స్పందించాలన్నారు. కరోనా బాధితులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివా్‌సరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌, జిల్లా వైద్యాధికారి సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయలక్ష్మి పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-13T10:51:40+05:30 IST