ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టే ముందే టెట్‌ నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-01-19T21:36:09+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పేట్టే ముందే మొదటగా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీ కోసం టెట్‌ నిర్వహించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు

ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టే ముందే టెట్‌ నిర్వహించాలి

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, జనవరి 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పేట్టే ముందే మొదటగా ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల భర్తీ కోసం టెట్‌ నిర్వహించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రం ఏ ర్పడిన అనంతరం మొదటి ఎన్నికల ప్రచారంలో కేజీ టూ పీజీ ఉచిత విధ్య అమలు అనే నినాదంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఇపుడు మాత్రం ఆంగ్లమాద్యమాన్ని అ మలు చేస్తానని పేర్కొంటూన్నారన్నారు. ఇప్పటికి ఇంకా ఇంగ్లీష్‌ మీడియం ఏర్పాటుపై అందరికంటే భిన్నంగా ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్‌ అని పేర్కొన్నారు. ఆంగ్లమాద్యమం ప్రవేశపెట్టే ముందు కేవలం మౌలిక సదుపాయాలు కల్పించినపుడు మాత్రమే విద్యా ర్థులకు న్యాయం జరుగదని, భోధన సదుపాయాల పట్ల దృష్టి పె ట్టాలే తప్ప వారి జీవితాలతో చెలగాటమాడవద్దన్నారు. గడిచిన ఐదేళ్లలో దేశంలో టెట్‌ నిర్వహిం చని రాష్ట్రంగా తెలంగాణ నిలిం చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్నాహ్న భోజనం పథకం ఏమైందోనని, వంట కార్మికులు తమ సమస్యలను పరిష్కరిం చా లని సమ్మెకు పోతే ప్రభుత్వం సంబుర పడుతుందన్నారు. తక్షణ మే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్క రించాలన్నారు. 


ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఫీజుల నియంత్ర ణపై ఇంతకు ముందే ఐఏఎస్‌ అధికారి ఉస్మానియా యూనివ ర్శిటి వైస్‌ చాన్స్‌లర్‌ తిరుపతి రావు కమిటీ ఉండేదని, ఆ కమిటీ పూర్తి రిపోర్టు కూడా తయారు చేశారని మళ్లీ ఇంకో కమిటీ ఎం దుకో సీఎం సమాధానం చెప్పాలన్నారు. నిజంగా ఫీజుల నియం త్రణపై సీఎంకు సంకల్పం ఉంటే తిరుపతి రావు కమిటీ ఇచ్చిన రిపోర్టును బహిర్గతం చేయాలన్నారు. మహిళా యూనివర్శిటీ ఏర్పాటు అని చెప్పి ఇప్పటికే నాలుగేళ్లు గడిచిందని ఈలోపు టీఆర్‌ఎస్‌ మంత్రులకు, ఎమ్మెల్సీలకు ఐదు ప్రైవేటు యూనివర్శిటీ లు కట్టబెట్టారన్నారు. క్యాబినెట్‌ సమావేశంలో ట్రైబల్‌ యూనివ ర్శిటీ చర్చే లేదన్నారు. ఆదివాసిల బిడ్డ కుమరం భీం పేరుతో ఆసి ఫాబాద్‌ జిల్లాలో ట్రైబల్‌ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రగతి భవన్‌ నిషేదిత ప్రాంతం కాదని, అధికార సీఎం నివాస మని, సామాన్యుడు విన్నవించేందుకు అందుబాటులో ఉండే ప్రాం తమని అన్నారు. ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్న జీవో 317 ను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఏసీ సీఎం జగన్‌,  అరవింద్‌ కేజ్రీవాల్‌లు అవలంబిస్తున్న విద్యా, వైద్య వ్యవస్థను చూసి సీఎం కేసీఆర్‌ నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ సమా వేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్‌, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ దుర్గయ్య, సీని యర్‌ కాంగ్రెస్‌ నాయకులు గాజుల రాజేందర్‌, కొండ్ర జగన్‌, పులి రాము, సిద్దం సత్తయ్య, మామిడి మహిపాల్‌, లక్ష్మణ్‌, మునీందర్‌ రెడ్డి, బీరం రాజేష్‌ ఉన్నారు.

Updated Date - 2022-01-19T21:36:09+05:30 IST