చెట్టు తొర్రలో చిక్కుకున్న ఉడుత.. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కాపాడిన ఫైర్‌పైటర్స్

ABN , First Publish Date - 2021-04-03T18:06:13+05:30 IST

చెట్టు తొర్రలో ఇరుక్కుని నరకయాతన అనుభవించిన ఉడుతను టెక్సాస్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడింది.

చెట్టు తొర్రలో చిక్కుకున్న ఉడుత.. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కాపాడిన ఫైర్‌పైటర్స్

టెక్సాస్: చెట్టు తొర్రలో ఇరుక్కుని నరకయాతన అనుభవించిన ఉడుతను టెక్సాస్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 30న రాత్రి 7.30 గంటల ప్రాంతంలో అస్టిన్ అగ్నిమాపక విభాగానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి ఒక ఫిర్యాదు చేశాడు. చెట్టు తొర్రలో ఇరుక్కున్న ఉడుత ఒకటి బయటకు రాలేకపోతుందనేది ఆ వ్యక్తి ఫిర్యాదు సారాంశం. దీంతో వెంటనే అతను చెప్పిన చోటుకు చేరుకుంది అగ్నిమాపక సిబ్బంది. అక్కడికి చేరుకున్న ఫైర్‌ఫైటర్స్‌ ఉడుత చెట్టు తొర్రలో చిక్కుకుని విలవిల్లాడటం గమనించారు. అంతే.. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది.. చాలాసేపు ఉడుత బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరకు ఎలాగోలా ఉడుతను బయటకు తీశారు. ఇక ఈ చిన్నప్రాణి కోసం అగ్నిమాపక సిబ్బంది చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ తాలూకు వీడియోను అస్టిన్ అగ్నిమాపక విభాగం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేసింది. దాంతో వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు టెక్సాస్ అగ్నిమాపక సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.   



Updated Date - 2021-04-03T18:06:13+05:30 IST