కమలా హ్యారిస్ నివాసం వద్ద సాయుధుడి అరెస్ట్ !

ABN , First Publish Date - 2021-03-18T17:32:09+05:30 IST

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నివాసం వద్ద అనుమానాస్పదంగా ఆయుధాలతో తిరుగుతున్న టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తిని బుధవారం వాషింగ్టన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కమలా హ్యారిస్ నివాసం వద్ద సాయుధుడి అరెస్ట్ !

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నివాసం వద్ద అనుమానాస్పదంగా ఆయుధాలతో తిరుగుతున్న టెక్సాస్‌కు చెందిన ఓ వ్యక్తిని బుధవారం వాషింగ్టన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం యుఎస్ నావల్ అబ్జర్వేటరీ అతని వాహనం నుంచి తుపాకీ, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నివాసం ఉంటున్న మాసాచుసెట్స్ ఎవెన్యూ వద్ద బుధవారం మధ్యాహ్నం 12.12 గంట ప్రాంతంలో(అమెరికా కాలమానం ప్రకారం) టెక్సాస్‌కు చెందిన పాల్ ముర్రే(31) అనే వ్యక్తి ఆయుధాలతో అనుమానాస్పదంగా తిరుగుతుండడం గమనించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.


అనంతరం ముర్రే వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఓ రైఫిల్‌తో పాటు భారీగా మందుగుండు సామాగ్రి దొరికింది. దీంతో అతనిపై ప్రమాదకరమైన ఆయుధాన్ని రవాణా చేయడం, రిజిస్టర్‌కాని తుపాకీని కలిగి ఉండటం, భారీ సామర్థ్యం గల మందుగుండు సామగ్రిని తరలించడం తదితర నేరాల కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే భారీ మొత్తంలో లైసెన్స్ లేని ఆయుధాలను అతడు ఎందుకు తీసుకెళుతున్నాడో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇక అధికారిక నివాసంలో మరమ్మతు పనులు జరుగుతున్న కారణంగా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఆమె భర్త డగ్ ఎమ్హాఫ్ ప్రస్తుతం వైట్‌హౌస్ అతిథిగృహమైన బ్లెయిర్‌ హౌస్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2021-03-18T17:32:09+05:30 IST