కొవిడ్-19: టెక్సాస్‌లో 19.41 శాతం పాజిటివ్ రేటు

ABN , First Publish Date - 2020-08-09T10:55:21+05:30 IST

టెక్సాస్‌లో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. టెక్సాస్‌లో ఏడు రోజుల కరోనా పాజిటివ్

కొవిడ్-19: టెక్సాస్‌లో 19.41 శాతం పాజిటివ్ రేటు

ఆస్టిన్: టెక్సాస్‌లో కరోనా మహమ్మారి విళయతాండవం ఆడుతోంది. టెక్సాస్‌లో ఏడు రోజుల కరోనా పాజిటివ్ రేటు 19.41 శాతానికి పెరిగినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు పాజిటివ్ రేట్ ఈ శాతం పెరగడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. జూలైలో అత్యధికంగా 17.43 శాతానికి పాజిటివ్ రేటు పెరగగా.. ఇప్పుడు ఏకంగా 19 శాతం దాటిపోయింది. టెక్సాస్‌లో శనివారం ఒక్కరోజే 6,959 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,81,483కు చేరుకుంది. ఇక శనివారం కరోనా కారణంగా 247 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా నమోదైన మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 8,343గా ఉంది. ఇక ప్రస్తుతం 1,34,797 మంది ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా మారిపోయాయి. కాగా.. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 50 లక్షలకు చేరువ కాగా.. మరణాల సంఖ్య లక్షా 61 వేలు దాటింది.

Updated Date - 2020-08-09T10:55:21+05:30 IST