టీఎఫ్‌సీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం!

ఇటీవల తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే! ఛైర్మన్‌గా ప్రతాని రామకృష్ణగౌడ్‌, టిఎఫ్‌సిసి వైస్‌ ఛైర్మన్‌లుగా ఎ.గురురాజ్‌, నెహ్రు, సెక్రటరీగా జెవిఆర్‌, తెలంగాణ మా ప్రెసిడెంట్‌గా రేష్మి ఠాకూర్‌, దర్శకుల సంఘం అధ్యక్షుడిగా రమేష్‌ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం టీఎఫ్‌సీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, మా అధ్యక్షుడు మంచు విష్ణు అతిథులుగా హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు విష్ణు చేతుల మీదుగా  ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. అనంతరం విష్ణు మాట్లాడుతూ ‘‘బాధ్యతాయుతమైన పదవి అలంకరించినప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఆంధ్రా, తెలంగాణ అనే బేధం నాకు లేదు. తెలుగువారిగా పరిశ్రమను అభివృద్ధి చేసుకోవాలి’’ అని  అన్నారు. ‘‘పరిశ్రమ అభివృద్ధి, ఆర్టిస్ట్‌ల కష్టాలు తీర్చడానికి శాయశక్తుల కృషి చేస్తా’’ అని ప్రతాని రామకృష్ణ గౌడ్‌ అన్నారు. 
Advertisement