ఉద్యోగుల సీనియారిటీని కాపాడాలి- టీజీవో

ABN , First Publish Date - 2021-09-11T21:39:01+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీల నేపధ్యంలో ఇప్పుడు చేపట్టబోయే జిల్లా, జోనల్‌, మల్లీజోనల్‌ వ్యవస్ధ లోకి ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపుల లో

ఉద్యోగుల సీనియారిటీని కాపాడాలి- టీజీవో

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే ఉద్యోగాల భర్తీల నేపధ్యంలో ఇప్పుడు చేపట్టబోయే జిల్లా, జోనల్‌, మల్లీజోనల్‌ వ్యవస్ధ లోకి ప్రస్తుత ఉద్యోగుల కేటాయింపుల లో పూర్తి పారదర్శకత పాటించి ఉద్యోగులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాద్యత ప్రభుత్వానిదేనని టీజీవో నేతలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల(టీజీవో) కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో టీజీవో భవన్‌లో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొత్త జోనల్‌ వ్యవస్ద పై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ఉద్యోగుల వేతన సవరణ ద్వారా ఇప్పుడు దేశంలోనే అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులుగా చరిత్ర సృష్టించడం దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే వారు కృతజ్ఞతలు తెలిపారు. 


ఈసందర్భంగా టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అన్నారు. రాబోయే ఉద్యోగాలన్నీ తెలంగాణ వారికే ఇవ్వాలనే ఏకైక సంకల్పంతో అన్ని క్యాడర్ల ఉద్యోగ నియామకాలకు సంబంధించి జోనల్‌ వ్యవస్దలో సమూల మార్పులు చేశారని అన్నారు. తెలంగాణ నిరుద్యోగులకు పూర్తి న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు జిల్లాలకు కేటాయించే ఉద్యోగుల సీనియారిటీకి ఎటువంటి అన్యాయం జరగకూడదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల్లో ఉన్న వివిధ రకాల అపోహలను, అనుమానాలను నివృత్తి చేసి ముందుకు వెళ్లాల్సిందిగా టీజీవో తరపున తాను కోరుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నగర అధ్యక్షులు జి. వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఎంబి కృష్ణాయాదవ్‌ తదితరులు ననపాల్గొన్నారు. 

Updated Date - 2021-09-11T21:39:01+05:30 IST