నగల దుకాణానికి రక్షణ ఇవ్వాల్సిన కుక్క ఏం చేసిందో చూడండి!

ABN , First Publish Date - 2021-03-03T12:53:25+05:30 IST

సోషల్ మీడియాలో ఒక కుక్కకు సంబంధించిన వీడియో వైరల్‌గా...

నగల దుకాణానికి రక్షణ ఇవ్వాల్సిన కుక్క ఏం చేసిందో చూడండి!

బ్యాంకాక్: సోషల్ మీడియాలో ఒక కుక్కకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. థాయ్‌ల్యాండ్‌లోని ఒక జ్యూయలరీ స్టోర్‌లో రాబరీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఒక వ్యక్తి దొంగ మాదిరిగా స్టోర్‌లోకి చొరబడ్డాడు. తుపాకీని చూపిస్తూ బెదిరింపులకు దిగాడు. 


అయితే అక్కడే ఉన్న కుక్క తనకేమీ సంబంధం లేనట్టు హాయిగా నిద్రపోతోంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం.. లక్కీ అనే ఈ కుక్క ఒక జ్యూయలరీ దుకాణానికి గార్డుగా ఉంది. తన జ్యూయలరీ దుకాణాన్ని కాపాడుతుందని ఆ శునకాన్ని దాని యజమాని ఎంతో ప్రేమగా పెంచుతూ వచ్చాడు. కాగా పోలీసులు ఈ దుకాణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఒక వ్యక్తి ఒక నకిలీ తుపాకీని తీసుకుని దుకాణంలోకి చొరబడి, నగలు, నగదు తనకు అప్పగించాలని బెదిరించాడు. ఇంత జరుగుతున్నా ఇదేమీ పట్టనట్టు ఆ కుక్క నిద్రపోతూనే ఉంది. ఈ ఉదంతం థాయ్‌ల్యాండ్‌లోని చియాంగ్ మాయీ పట్టణంలో చోటుచేసుకుంది. దుకాణంలోని సీసీ కెమెరాలో ఈ ఉదంతమంతా రికార్డయ్యింది. ఇప్పుడిది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

                                                ‘లేటెస్ట్‌లీ’ సౌజన్యంతో...

Updated Date - 2021-03-03T12:53:25+05:30 IST