May 6 2021 @ 18:15PM

కీ బోర్డ్ ప్లేయర్ పట్ల థమన్ ధాతృత్వం

సంగీత దర్శకుడు థమన్ ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందిన కీ బోర్డ్ ప్లేయర్, ప్రోగ్రామర్ కమల్ కుమార్ కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. పలువురు సంగీత దర్శకుల వద్ద కీ బోర్డ్ ప్లేయర్‌గా పని చేసిన కమల్ కుమార్‌కు కరోనా పాజిటివ్ వచ్చి ఆరోగ్యం క్షీణించి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న సంగీత దర్శకుడు థమన్ ఆయన కుటుంబానికి అండగా నిలిచి దాదాపు 90 వేల రూపాయల హాస్పిటల్ బిల్ చెల్లించడమే కాకుండా పదవ తరగతి చదువుతున్న కుమారుడు చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయం చే బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సంగీత విభాగంలో ఉండే కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ విధంగా కమల్ కుమార్ కుటుంబానికి సహాయం అందించాలని ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. థమన్ తీసుకున్న ఈ బాధ్యతకు పలువురు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు థమన్ మాదిరిగా అందరూ స్పందించాలని కోరుతున్నారు.