Feb 23 2021 @ 11:26AM

`సూపర్`స్టార్ పిక్ షేర్ చేసిన తమన్!

`సరిలేరు నీకెవ్వరు` వంటి హిట్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. `గీతగోవిందం` ఫేమ్ పరశురామ్ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలె దుబాయ్‌లో ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

 తాజాగా దుబాయ్ లొకేషన్‌లో తీసిన మహేష్ బాబు ఫొటోను తమన్ అభిమానులతో పంచుకున్నాడు. ఫేస్‌కు మాస్క్ వేసుకుని మహేష్ స్టైలిష్‌గా ఉన్నాడు. ఈ ఫొటోను షేర్ చేసిన తమన్.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని, కోవిడ్ నేపథ్యంలో నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొన్నాడు. హైదరాబాద్ చేరుకున్న `సర్కారు వారి` టీమ్ త్వరలోనే గోవా బయలుదేరనుంది. అక్కడ కీర్తి, మహేష్ మధ్య ఓ పాటను చిత్రీకరించబోతున్నట్టు సమాచారం.