Abn logo
Aug 5 2020 @ 11:37AM

బీరుట్ ఘ‌ట‌న‌పై త‌మ‌న్నా, ర‌కుల్ స్పంద‌న‌లు

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని ఓడరేవు పరిసరాల్లో పావుగంట వ్యవధిలోనే రెండు భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 78 మంది మృతిచెందగా.. దాదాపు 4 వేల మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి అక్కడ భారీగా భవనాలు కుప్పకూలడంతో చాలా మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌పై యావ‌త్ ప్ర‌పంచం విస్తుపోయింది. పేలుళ్లలో చనిపోయిన వారికి సంతాపాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగు చిత్ర సీమ విష‌యానికి వ‌స్తే.. ప‌లువురు సెల‌బ్రిటీలు బీరుట్ ఘటనపై ట్విట్ట‌ర్ ద్వారా సంతాపాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ‘‘గుండె పగిలిపోయింది. 2020లో ఇప్పటికే చాలా జరిగాయి. ఎందుకిలా? ఇక చాలు. బీరుట్‌లోని ప్ర‌జ‌ల‌కు మ‌నోధైర్యాన్నివ్వాల‌ని ప్రార్థిస్తున్నాను’’ అని రకుల్ ప్రీత్ ట్వీట్ చేశారు. ‘‘గుండె ముక్క‌ల‌య్యే విష‌య‌మిది. ఈ దుర్ఘ‌ట‌న‌తో క‌ల‌త చెందాను. బీరుట్ ప్ర‌జ‌ల‌కు సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను’’ అని త‌మ‌న్నా ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement