Abn logo
Nov 22 2020 @ 02:57AM

పుష్కరాల్లో ‘తానా’ సేవలు

Kaakateeya

అమరావతి, కర్నూలు కల్చరల్‌ నవంబరు 21, (ఆంధ్రజ్యోతి): వృద్ధ్దాశ్రమల్లోని వృద్ధులు, ఆశ్రయం లేని వారు, పేవ్‌మెంట్లపైనే కాలం వెల్లదీస్తున్నవారికి రాష్ట్రవ్యాప్తంగా 21వేల రగ్గులను పంపిణీ చేసినట్లు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపు తెలిపారు. అలాగే, కరోనా నేపథ్యంలో అమెరికాలో నిరుపేదలను ఆదుకునేందుకు నవంబరు 14నుంచి డిసెంబరు 31వరకు ఫుడ్‌ డ్రైవ్‌ పేరిట అమెరికాలోని 150ప్రాంతాల్లో ఆహారపదార్థాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


మరోవైపు తుంగభద్ర పుష్కరాల సందర్భంగా కర్నూలులోని పుష్కర ఘాట్ల వద్ద శనివారం తానా ఆధ్వర్యంలో ఆహార పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ డీకే బాలాజీ, ట్రాఫిక్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా ప్రారంభించారు. తానా కార్యదర్శి పొట్లూరి రవి సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పుష్కరాలు ముగిసేవరకు జరుగుతుందని బాలాజీ క్యాంటీన్‌ అధినేత ముప్పా రాజశేఖర్‌ తెలిపారు. 

Advertisement
Advertisement