Abn logo
Sep 21 2021 @ 11:43AM

Thane: కుమార్తెపై అత్యాచారానికి అనుమతించిన తల్లి

అనారోగ్యం నయం చేస్తానంటూ బాలికపై అత్యాచారం

థానే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని భివండీలో దారుణం జరిగింది. సాక్షాత్తూ కన్న తల్లే తన కుమార్తెపై అత్యాచారం చేయమని ఓ వ్యక్తిని అనుమతించిన దారుణ ఘటన భివండీలో జరిగింది. చనిపోయిన మామయ్య తన కుమార్తెకు దయ్యమై ఆవహించాడనే సాకుతో స్వయం ప్రకటిత దేవుడనే చెప్పుకునే ఓ వ్యక్తిని అత్యాచారం చేసేందుకు తల్లి అనుమతించడం సంచలనం రేపింది. 16 ఏళ్ల తన కుమార్తెకు మామయ్య దయ్యమై ఆవహించడం వల్ల తీవ్రమైన మెడనొప్పి ఉందని తల్లి భావించింది. 

స్వయం ప్రకటిత దేవుడని చెప్పుకునే ఓ వ్యక్తితో తన కుమార్తెను అడవికి పంపించింది. స్వయం ప్రకటిత దేవుడని చెప్పుకునే వ్యక్తి బాలికకు పట్టిన దయ్యాన్ని వదిలించి అనారోగ్యాన్ని దూరం చేస్తానని చెప్పి బాలికను అడవిలోకి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. బాధిత బాలిక ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసి అత్యాచారం చేసిన వ్యక్తితోపాటు దానికి సహకరించిన తల్లిని కూడా అరెస్టు చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...