Abn logo
Nov 28 2020 @ 00:32AM

కొత్తగా.. గర్భవతిగా అనసూయ

గర్భవతిగా అనసూయ భరద్వాజ్‌ నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’. విరాజ్‌ అశ్విన్‌ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారీ చిత్రంలో! వీళ్లిద్దరి ఫస్ట్‌ లుక్‌ (క్యాస్ట్‌ రివీల్‌) పోస్టర్‌ను శుక్రవారం హీరో సాయితేజ్‌ విడుదల చేశారు. దీన్ని బట్టి సినిమాలో కథకూ, లిఫ్ట్‌కీ ఏదో సంబంధం ఉందనీ... లిఫ్ట్‌లో వీళ్లిద్దరూ గొడవ పడ్డారని ఊహించవచ్చు. చిత్రనిర్మాతలు శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి మాట్లాడుతూ ‘‘చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉత్కంఠభరిత అంశాలతో డ్రామా ఫిల్మ్‌గా రూపొందిస్తున్నాం’’ అని చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement