May 15 2021 @ 14:43PM

ప్రకాశ్‌ రాజ్‌ వస్తే షూటింగ్‌ ఫినిష్‌!

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌  ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, ‘మేజర్‌’, ‘సర్కార్‌వారి పాట’,  కన్నడలో ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌–2’, తమిళంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’, ‘అన్నాత్తే’, ‘ఎనిమీ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రెండు హిందీ చిత్రాలు కూడా అంగీకరించనట్లు సమాచారం. అయితే తెలుగులో నాగచైతన్య, రాశీఖన్నా జంటగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ‘ధ్యాంక్యూ’ చిత్రంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల 20 రోజులకు పైగా ఇటలీలో షెడ్యూల్‌ పూర్తి చేసి హైదరాబాద్‌ తిరిగొచ్చారు. దీనితో నాలుగు రోజులు మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నాలుగు రోజుల షెడ్యూల్‌ ప్రకాశ్‌రాజ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందట. ఆయన డేట్స్‌ దొరికితే ‘థ్యాంక్యూ’ సినిమా పూర్తయినట్లే. ప్రకాశ్‌రాజ్‌ కోసం ప్రస్తుతం చిత్ర బృందం వేచి చూస్తోంది. ఆయన బిజీ షెడ్యూల్‌, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి డేట్స్‌ ఎప్పుడిస్తారో చూడాలి!