Abn logo
Sep 17 2021 @ 07:31AM

Mumbai: కుప్పకూలిన ఫ్లై ఓవర్..13మంది కార్మికులకు గాయాలు

ముంబై : మహారాష్ట్రలోని ముంబై నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలిన ఘటనలో 13 మంది కార్మికులు గాయపడ్డారు.ముంబై నగరంలోని బాండ్రా కుర్లా కాంప్లెక్సు వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో ముంబై పోలీసులు, అగ్నిమాపకశాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చారు. ఈ దుర్ఘటనలో గాయపడిన 13 మంది కార్మికులను శాంతాక్రజ్ లోని వీఎన్ దేశాయ్ ఆసుపత్రికి తరలించారు. ఫ్లై ఓవర్ కూలిన స్థలంలో శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. శిథిలాలను తొలగించే పనులు చేపట్టారు. నాణ్యత లోపం వల్లనే ఫ్లై ఓవర్ కుప్పకూలిందని అంటున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption