Abn logo
Sep 18 2020 @ 21:48PM

తరుణ్ భాస్కర్ వదిలిన ‘మెరిసే మెరిసే’ ఫస్ట్ లుక్

Kaakateeya

కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకటేష్ కొత్తూరి నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి 'మెరిసే మెరిసే' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్ర టైటిల్ లుక్‌ పోస్టర్‌ను తాజాగా దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో హుషారు ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా నటిస్తుండగా, శ్వేతా అవస్తీ హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో మిళితమైన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని చిత్రయూనిట్‌ తెలుపుతుంది. 

చిత్ర టైటిల్‌ ఫస్ట్ లుక్‌ విడుదల సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ... ''ప్రస్తుతం మెరిసే మెరిసే చిత్రం డిఐ వర్క్స్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన మా సినిమా థీమ్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. మా మూవీ ఫస్ట్ లుక్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి చాలా బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులకూ నచ్చే విధంగా ఉంటుంది.." అని తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement