మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు...

ABN , First Publish Date - 2021-01-12T20:43:02+05:30 IST

మరో బ్యాంకు లైసెన్స్ రద్దైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసేసింది. ఈ క్రమంలో... ఆ బ్యాంక్ ఇకపై కార్యకలాపాలను నిర్వహించదు.

మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు...

మెుంబై : మరో బ్యాంకు లైసెన్స్ రద్దైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసేసింది. ఈ క్రమంలో... ఆ బ్యాంక్ ఇకపై కార్యకలాపాలను నిర్వహించదు.  ఆర్‌బీఐ తాజాగా వసంతదా నగరి సహకారి బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసేసింది. జనవరి 11 నుంచి బ్యాంక్ లైసెన్స్ రద్దు నిర్ణయం అమలులోకి వచ్చిందని ఆర్‌బీఐ తెలిపింది. వివరాలిలా ఉన్నాయి.


మహరాష్ట్రలోని ఉస్మానాబాద్ కేంద్రంగా వసంతదా నగరి సహకారి బ్యాంక్  బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించకుండా ఉండేలా చూడాలని, బ్యాంక్‌కు లిక్విడేటర్‌ను నియమించాలని ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది.


నిబంధనలకణుగుణంగా కార్యకలాపాలు నిర్వహించడం లేదని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే డిపాజిటర్లపై ప్రతికూల ప్రభావం పడొచ్చనే ఉద్దేశంతో ఆర్‌బీఐ ఈ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసింది. వివరాలిలా ఉన్నాయి.


వసంతదా నగరి సహకారి బ్యాంక్ ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్ దారులకు పూర్తిగా డబ్బులు చెల్లించే స్థితిలో లేదు. బ్యాంక్ లైసెన్స్ రద్దు నేపధ్యంలో ఈ బ్యాంక్ ఇక కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోలేదు. కాగా... బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారికి మాత్రం ఎటువంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు.

Updated Date - 2021-01-12T20:43:02+05:30 IST