అది ‘వ్యాక్సిన్ వివక్ష’.. హెచ్చరించిన దేశాధ్యక్షుడు

ABN , First Publish Date - 2021-05-11T04:47:40+05:30 IST

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే దిక్కు. అయితే అభివృద్ధి చెందిన, ధనిక దేశాల ప్రజలకు కరోనా వ్యాక్సిన్..

అది ‘వ్యాక్సిన్ వివక్ష’.. హెచ్చరించిన దేశాధ్యక్షుడు

కేప్‌టౌన్: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని గజగజలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే దిక్కు. అయితే అభివృద్ధి చెందిన, ధనిక దేశాల ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ముందుగా లభించి, పేద దేశాల ప్రజలు క్యూలో వేచి చూస్తూనే చనిపోవడం సమంజసం కాదని సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అన్నారు. ఈ పరిస్థితి వ్యాక్సిన్ అపార్తీడ్ (వ్యాక్సిన్ వివక్ష) వంటిదని ఆయన చెప్పారు. కరోనా వ్యాక్సిన్‌కు పేటెంట్‌ను మినహాయించాలని సౌతాఫ్రికా, భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ వద్ద డిమాండ్‌ను ఉంచాయి. దీనిపై ప్రపంచ దేశాల మధ్య చర్చ జరుగుతున్న క్రమంలోనే రామఫోసా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

Updated Date - 2021-05-11T04:47:40+05:30 IST