అగ్గిపెట్టెలాంటి ఇంత చిన్న ఇంటి ధర రూ.2 కోట్లా అని ఆశ్చర్యపోతున్నారా..? ఎందుకింత ఖరీదంటే..

ABN , First Publish Date - 2021-11-10T00:21:41+05:30 IST

అమెరికాలోని మసాచుసెట్స్ పరిధి న్యూటన్ హైలాండ్స్‌లో 250 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఓ ఇల్లు.. హాట్‌టాపిక్‌గా మారింది. స్టోర్ రూం సైజులో ఉన్న ఈ ఇల్లు ఏకంగా $3,15,000 (రూ.2.3 కోట్లు) పలుకుతోంది.

అగ్గిపెట్టెలాంటి ఇంత చిన్న ఇంటి ధర రూ.2 కోట్లా అని ఆశ్చర్యపోతున్నారా..? ఎందుకింత ఖరీదంటే..

ప్రాంతాన్ని బట్టి ఇళ్లు, స్థలాలకు విలువ ఉంటుంది. కొన్నిసార్లు పురాతన వస్తువులు, భవంతులకు భారీ డిమాండ్ ఉంటుంది. అలాంటి వాటిని కొనుగోలు చేసేందుకు డబ్బులున్నవారు ఎగడబడుతుంటారు. వాటిని సొంతం చేసుకుకోవడం ద్వారా తమ ప్రతిష్టను ఇంకా పెంచుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ విషయం పక్కనపెడితే.. మరీ అగ్గిపెట్టె లాంటి చిన్న ఇంటికి రూ.2కోట్లంటే చాలా ఎక్కువే. మరి ఇంత చిన్న ఇంటికి అంత డిమాండ్ ఎందుకుందటే..


అమెరికాలోని మసాచుసెట్స్ పరిధి న్యూటన్ హైలాండ్స్‌లో 250 చదరపు అడుగుల స్థలంలో కట్టిన ఓ ఇల్లు.. హాట్‌టాపిక్‌గా మారింది. స్టోర్ రూం సైజులో ఉన్న ఈ ఇల్లు ఏకంగా $3,15,000 (రూ.2.3 కోట్లు) పలుకుతోంది. కోల్డ్‌వెల్ బ్యాంకర్ రియాలిటీకి చెందిన హాన్స్ బ్రింగ్స్ రిజల్ట్స్ ఏజెన్సీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. వారి సమాచారం మేరకు.. ఆ ఇంటిపై ఓ గడ్డివాముతో పాటూ బేస్‌మెంట్, గ్రానైట్ కౌంటర్ టాప్‌తో ఉన్న కిచెన్ ఉన్నాయట. అలాగే లైటింగ్, ఎలక్ట్రికల్ పరికరాలన్నీ కొత్తగా ఏర్పాటు చేశారు. దీనికి ఓ మెయింటెనెన్స్ యార్డ్ కూడా ఉందట.


ఎన్ని ప్రత్యేకలున్నా మరీ అంత రేటంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఇల్లు కొత్తగా కట్టింది కాదు.. 50 ఏళ్ల క్రితం కట్టిందట. అయితే రంగులు వేయడంతో కొత్తగా కనిపిస్తోంది. అందులోనూ ఈ ఇల్లు.. బోస్టన్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంది. ఆ ప్రాంతంలో ఇళ్లు, ఆస్తుల విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే దీనికి అంత డిమాండ్ ఉందని తెలిసింది. దీన్ని మెడిటేషన్ సెంటర్, స్టోర్, ఎక్సర్‌సైజ్ రూమ్‌లా వాడుకోవచ్చని చెబుతున్నారు. మనుషులు ఉండేదుకు వీలు లేకపోవడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అలాగే ఇంటి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపడం లేదు.



Updated Date - 2021-11-10T00:21:41+05:30 IST