Abn logo
Sep 23 2021 @ 15:43PM

ప్రేమ విషయంలో న్యాయం జరగలేదని...

చిత్తూరు: ప్రేమ విషయంలో తనకు న్యాయం జరగలేదని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రేమించిన యువకుడు మోసం చేశాడని షఫియా అనే యువతి 15 రోజులుగా ప్రియుడు ఇంటి ఎదుట మౌన పోరాటం చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో విన్నవించుకుంది. అప్పటికీ తనకు న్యాయం జరగలేదని మనస్థాపం చెందింది. ఓ ప్రైవేటు లాడ్జిలో నిద్ర మాత్రలు మింగింది. అపస్మారక స్థతిలో ఉన్న షఫియాను చికిత్స నిమిత్తం జిల్లా వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...