ఈ మందు బాటిల్... రూ. కోటి పైమాటే...

ABN , First Publish Date - 2021-07-19T01:28:13+05:30 IST

మద్యం ఫుల్ బాటిల్ ధర అటూ ఇటుగా రూ.1000 లేదంటో రూ.2000 ఇక ప్రీమియమ్ మద్యం ధర రూ.10వేల వరకు ఉంటుంది.

ఈ మందు బాటిల్... రూ. కోటి పైమాటే...

డెట్రాయిట్ : మద్యం ఫుల్ బాటిల్ ధర అటూ ఇటుగా రూ. వెయ్యి, లేదంటే రూ. రెండు వేలు. ఇక ప్రీమియమ్ మద్యం ధర రూ. 10 వేల వరకు ఉంటుంది. మరికొన్ని రూ. 10 లక్షల వరకూ ఉన్నాయి. కానీ ఒక మద్యం బాటిల్‌ అక్ష రాలా కోటి రూపాయలకు అమ్ముడైంది. ఈ విస్కీ బాటిల్ 250 సంవత్సరాల కాలం నాటి కిందటిదట.


ఇక దాని అసలు ధర కంటే ఆరు రెట్లు ఎక్కువ ధరకు వేలంలో అమ్ముడైంది. బాటిల్‌ను వేలం వేయగా.. 1,37,000 డాలర్లు(అంటే భారత కరెన్సీలో రూ. 1,02,63,019 లకు) పలికింది. కాగా... ఈ మద్యం బాటిల్ దాదాపు 350 సంవత్సరాల క్రితం నాటిదని చెబుతునర్నారు. ఇక ఈ రేటు పలికింది అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో. 

Updated Date - 2021-07-19T01:28:13+05:30 IST