ఆ ఎస్‌ఐ మహా ముదురు

ABN , First Publish Date - 2021-10-24T06:53:39+05:30 IST

జిల్లా కేంద్రానికి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఓ పోలీ్‌సస్టేషన్‌ బాస్‌ నేరుగా దసరా మామూళ్లు వసూలు చేయడం చర్చనీయాంశమైంది.

ఆ ఎస్‌ఐ మహా ముదురు

పోలీసులు, జర్నలిస్టులకు వాటా పేరుతో దసరా మామూళ్లు వసూలు

ఎంచక్కా సొంత జేబులోకి


నల్లగొండ, అక్టోబరు 23: జిల్లా కేంద్రానికి సుమారు 30కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇటీవల పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఓ పోలీ్‌సస్టేషన్‌ బాస్‌ నేరుగా దసరా మామూళ్లు వసూలు చేయడం చర్చనీయాంశమైంది. అంతేకాదు ఈ మామూళ్లను జర్నలిస్టులు, పోలీస్‌ సిబ్బంది పేరుతో వసూలు చేసి ఎవ్వరి కీ వాటా ఇవ్వకుండా సొంత జేబులో వేసుకున్నారు.

జిల్లాలో పోలీసు సిబ్బంది ఎవ్వరైనా దసరా మా మూళ్లు వసూలుచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ స్వయంగా హెచ్చరించారు. అయినా ఈ ఎస్‌ఐ మా త్రం బేఖాతర్‌ చేస్తూ నేరుగా వసూలు చేసి జేబులో వేసుకున్నారు. దసరా ముందు రెండు, మూడు రోజు సెలవు పెట్టిమరీ మండలంలోని ముఖ్య నేతలందరి వద్ద చేయిచాచాడు. కొత్తగా అధికార పార్టీలో చేరిన వారిని కూడా వదల్లేదు. జడ్పీటీసీ, మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పలువురు కౌన్సిలర్లు, పలు పార్టీల నేతల నుంచి భారీగానే పిండుకున్నాడు. గతంలో దస రా రోజున పోలీ్‌సస్టేషన్‌లో ఆయుధ పూజచేసి జంతువును బలిచ్చి మాంసాన్ని సిబ్బందికి పంచేవారు. అయితే  దసరా పేరుతో మామూళ్లు వసూలు చేసిన సదరు ఎస్‌ఐ సిబ్బందికి ముక్క, మందు చుక్క కూడా పోయలేదని అక్కడి పోలీసులే చర్చించుకుంటున్నారు. ఇక మామూళ్లు సమర్పించుకున్న ప్రజాప్రతినిధులకు ఈ విషయం తెలిసి ముక్కున వేలువేసుకోవడం  వారి వంతైంది. కాగా, ఇటీవల ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సదరు ఎస్‌ఐ వీఆర్‌కు అటాచ్‌ అయినట్టు సోషల్‌ మీడియాలో గుప్పుమంది. అయితే ఓ మంత్రి అనుయాయుడు సదరు ఎస్‌ఐకి సన్నిహితుడు కావడంతో సదరు ఆర్డర్‌ కాపీ బయటికి రాకుండా మేనేజ్‌ చేసినట్టు గుప్పుమంటోంది. ఆయన సదరు పోలీ్‌సస్టేషన్‌కు బదిలీ అయి మూడు నాలుగు నెలలే అవుతుండ గా, ఇప్పటి వరకు పలు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మరీ ఈ మామూళ్ల వ్యవహారంపై ఎస్పీ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

Updated Date - 2021-10-24T06:53:39+05:30 IST