Abn logo
Apr 10 2020 @ 05:12AM

22 మంది సింగర్స్‌తో ఆ పాట

ఇంతకుముందు ప్రపంచం ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంది. మరెన్నో వైపరీత్యాలను తట్టుకుంది. సమస్త మానవాళిని భయపెట్టి వెంటాడుతున్న కరోనా మహమ్మారిని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. మందేలేని ఈ మహమ్మారిని తరిమి కొట్టడానికి అన్నిరంగాల వారు కృష్టి చేస్తున్నారు. సినిమా స్టార్లు పలు మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. కవులు తమ కలానికి పని చెప్పి పదునైన పదాలు రచిస్తుంటే... గాయనీగాయకులు గళమెత్తున్నారు. అందులో భాగంగా ప్రముఖ గాయని కె.ఎస్‌.చిత్ర ‘లోకా సమస్తా సుఖినో భవంతు’ అంటూ ఓ పాటను రూపొందించి తన ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేశారు. మలయాళంలో పేరొందిన 22 గాయనీగాయకులు తమ ఇళ్లల్లో ఉండి ఈ పాటను రూపొందించారు. ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసిన 24 గంటల్లోనే దాదాపు మూడున్నర లక్షల మంది ఈ పాటను వీక్షించారని మలయాళ గాయకుడు వి.దేవానంద్‌ తెలిపారు. ‘‘‘స్నేహదీపం మిళి తురక్కు’ చిత్రంలోని ‘లోకం మురువన్‌ సుఖం పకరానయ్‌’ అంటూ సాగే అద్భుతమైన భక్తి గీతమిది. చిత్రగారు ఈ ఐడియా చెప్పినప్పుడు మా టీమ్‌ అంతా ఇందులో భాగం కావాలనుకున్నాం. జానకిగారు పాడిన ఈ అర్ధవంతమైన పాటను ‘కొవిడ్‌ 19’ అవగాహన కోసం మేమంతా పాడడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఆయన చెప్పారు. ‘‘కరోనా దెబ్బతో అతలాకుతలం అవుతున్న మానవాళి త్వరలోనే కోలుకొని లోకం శాంతిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, జనాల్లో అవగాహన కలిగించేందుకు ఈ పాటను రూపొందించామని కె.ఎస్‌. చిత్ర తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement