Apr 11 2021 @ 00:41AM

అది నా జీవితంలో ఒక్క శాతమే!

‘‘ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చూసేది నా నిజ జీవితంలో ఒక్క శాతమే’’ అని అనుపమా పరమేశ్వరన్‌ అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో నో మేకప్‌, నో ఫిల్టర్‌ ఫొటోలు పోస్ట్‌ చేశారామె. చాలామంది నెటిజన్లు ఆ ఫొటోలు చూసి... ‘చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం మీరు ఏం చేస్తారు? మీకు అంత పర్‌ఫెక్ట్‌ స్కిన్‌ ఎలా ఉంది? తళతళ ఎలా మెరుస్తుంది?’ అని ప్రశ్నలు అడిగారు. అందుకు బదులుగా తనది పర్‌ఫెక్ట్‌ స్కిన్‌ కాదని అనుపమ చెప్పారు. ‘‘ఎవరికీ పర్‌ఫెక్ట్‌ స్కిన్‌ ఉండదు. నాకు మొటిమలు వస్తాయి. ఇప్పుడూ నా ముఖం మీద ఒకటి ఉంది. అలాగే, పింపుల్‌ మార్క్స్‌ ఉంటాయి. ఎవరూ పర్‌ఫెక్ట్‌ కాదు. ఎండకు నా చర్మం కమిలిపోతుంది. ఇన్‌స్టాలో చూసేది ఒక్క శాతమే. నా గాలరీలో బెస్ట్‌ పిక్చర్‌ సెలక్ట్‌ చేసి పోస్ట్‌ చేస్తుంటా. మనమంతా ఒక్కటే’’ అని అనుపమా పరమేశ్వరన్‌ వివరించారు.