టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో అదే టర్నింగ్ పాయింగ్: సౌతీ

ABN , First Publish Date - 2020-02-22T23:19:56+05:30 IST

బేసిన్‌ రిజర్వ్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీసేనపై కివీస్ జట్టు 51 పరుగుల ఆధిక్యం

టీం ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో అదే టర్నింగ్ పాయింగ్: సౌతీ

వెల్లింగ్టన్: బేసిన్‌ రిజర్వ్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి కోహ్లీసేనపై కివీస్ జట్టు 51 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. దీంతో భారత్ 165 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత భారత బౌలర్లు కివీస్ బ్యాట్స్‌మెన్లను కట్టడి చేసినా.. కెప్టెన్ విలియమ్‌సన్ కృషితో రెండో రోజు ఆట ముగిసేసమయానికి న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. అయితే భారత.. తొలి ఇన్నింగ్స్‌ ఎక్కడ మలుపు తిరిగిందో.. కివీస్ బౌలర్ టిమ్ సౌతీ వెల్లడించాడు. 


రెండో రోజు ఆట ఆరంభమైన సమయానికి అజింక్యా రహానే, రిషబ్ పంత్‌ల జోడీ క్రీజ్‌లో స్థిరపడింది. అయితే సమన్వయం లోపించడంతో రిషబ్ పంత్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. అక్కడే ఇన్నింగ్స్ మలుపు తిరిగిందని సౌతీ పేర్కొన్నాడు. 


‘‘పంత్ రనౌట్.. ఈ రోజు ఉదయం జరిగిన అతి పెద్ద విషయం. పంత్ వంటి బలమైన బ్యాట్స్‌మెన్ రెండో కొత్త బంతితో మరో బ్యాట్స్‌మెన్ రహానేతో కలిసి ఎన్నో పరుగులు చేసేవాడు. అప్పటికే రహానే దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు మేము అద్భుతంగా బౌలింగ్ చేశాము. క్రీజ్‌లో స్థిరపడ్డ ఇద్దరు బలమైన ఆటగాళ్లను కట్టడి చేసి.. భారత బ్యాటింగ్ లైనప్‌ని ముగించాము’’ అని సౌతీ అన్నాడు.

Updated Date - 2020-02-22T23:19:56+05:30 IST