Advertisement
Advertisement
Abn logo
Advertisement

అతడికి 31 ఏళ్ల వయసు.. సిటీలో లక్షల్లో జీతమొచ్చే జాబ్.. రెండ్రోజుల్లో నిశ్చితార్థం ఉండగా మొబైల్ స్విచాఫ్.. ఆరా తీస్తే..

పెళ్లి నిశ్చయం అయినప్పటి నంచి.. పెళ్లి పీటల మీదకు వెళ్లేవరకు చాలా విచిత్రాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి వినకూడని వార్తలు వినాల్సి వస్తుంది. బలవంతపు పెళ్లిళ్ల విషయంలో అయితే ఇంకా ఎక్కువ ఘోరాలు జరుగుతుంటాయి. పెద్దల మాట కాదనలేక పెళ్లి చేసుకునే వారు.. ఆఖరు నిముషంలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బెంగళూరులో ఓ వ్యక్తి కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నాడు. లక్షల్లో జీతం తీసుకుంటున్న అతనికి పెళ్లి నిశ్చయమైంది. రెండు రోజుల్లో పెళ్లనగా అతను చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని పుత్తూరు తాలూకా పడువన్నూరు గ్రామానికి చెందిన రవిరాజ్(31) బెంగళూరులో ఉద్యోగం చేస్తుటాడు. లక్షల్లో జీతం తీసుకుంటున్నాడు. దీంతో పెళ్లి సంబంధాలు కూడా చాలా వచ్చేవి. దీంతో అతడి తల్లిదండ్రులు ఓ మంచి సంబంధాన్ని ఖాయం చేశారు. ఈనెల 25న నిశ్చితార్థం పెట్టుకున్నారు. దీంతో రవిరాజ్ ఉద్యోగానికి సెలవు పెట్టి, స్వగ్రామానికి చేరుకున్నాడు. తల్లిదండ్రులతో సంతోషంగా గడిపాడు. స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి.. ఆదివారం రాత్రి వెళ్లిపోయాడు. అయితే తర్వాత ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అయితే ఫోన్ కూడా స్విచ్ఛాప్ అని వచ్చింది. దీంతో అతడి స్నేహితులు, తెలిసిన వారికి ఫోన్ చేసి విచారించారు.

అప్పటికే ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు.. తెలిసిన వారి నుంచి సోమవారం ఫోన్ వచ్చింది. మడ్నూరు గ్రామంలో కొత్తగా కట్టుకున్న ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఈ వార్త విన్న తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారి విచారణలో అసలు విషయం తెలిసింది. కుందాపురకు చెందిన ఓ యువతిని రవిరాజ్ ప్రేమించేవాడు. అయితే ఆమెకు వివాహమైందని తెలుసుకుని కుమిలిపోయాడు. ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలిసింది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement