కళ్లు లేవని తెలిసినా పెళ్లి చేసుకుంది.. ఓ రోజు.. అర్జెంట్ పనుంది.. మళ్లీ వస్తానంటూ వెళ్లింది.. తీరా ఆధార్ కార్డు చూస్తే..

ABN , First Publish Date - 2021-11-14T21:55:55+05:30 IST

పూణేలో ఓ వ్యక్తికి రెండు కళ్లూ కనపడవు. కానీ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో మ్యారేజ్ బ్రోకర్‌ను సంప్రదించాడు. వారు కూడా మంచి సంబంధాన్ని చూశారు.

కళ్లు లేవని తెలిసినా పెళ్లి చేసుకుంది.. ఓ రోజు.. అర్జెంట్ పనుంది.. మళ్లీ వస్తానంటూ వెళ్లింది.. తీరా ఆధార్ కార్డు చూస్తే..
ప్రతీకాత్మక చిత్రం

ఒక్కోసారి అన్నీ సక్రమంగా వారికి సంబంధం కుదరాలంటేనే చాలా కష్టం. అలాంటిది ఏదైనా లోపం ఉన్న వారికి పెళ్లి కావాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఇలాంటి సమయాల్లో చాలా మంది మ్యారేజ్ బ్రోకర్లను ఆశ్రయిస్తుంటారు. సంబంధాలు కుదిర్చినందుకు వారికి కొంత మొత్తాన్ని ముట్టచెప్పాల్సి ఉంటుంది. పూణేలో ఓ వ్యక్తికి రెండు కళ్లూ కనపడవు. కానీ మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి సంబంధాలు రాకపోవడంతో మ్యారేజ్ బ్రోకర్‌ను సంప్రదించాడు. వారు కూడా మంచి సంబంధాన్ని చూశారు. సంసారం సాఫీగా సాగిపోతున్న క్రమంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది..


పూణేలో నివాసం ఉంటున్న వినోద్ చౌదరికి రెండు కళ్లూ కనిపించవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాడు. దివ్యాంగుడు కావడంతో అతడిని వివాహం చేసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు. డబ్బులు బాగా సంపాదించినా, పెళ్లి మాత్రం అవడం లేదనే బాధ అతడిని వెంటాడుతూ ఉండేది. ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాడు. చివరికి మ్యారేజ్ బ్రోకర్‌ కైలాస్ కుమార్ సింఘ్వీని సంప్రదించాడు. పెళ్లి సంబంధం చూడడం కోసం అతడికి సుమారు రూ.9 లక్షల వరకు ముట్టజెప్పాడు. ఎట్టకేలకు సారిక అనే అమ్మాయితో వినోద్‌కు వివాహం జరిగింది. సారిక కుటుంబానికి కూడా ఎదురు కట్నం ఇచ్చి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఇద్దరూ ఆనందంగా జీవించేవారు.


ఏడు నెలల తర్వాత ఓ రోజు అనుకోని ఘటన జరిగింది. అర్జంట్ పనుంది, కొన్ని రోజుల్లో తిరిగొస్తానంటూ భార్య వెళ్లిపోయింది. రోజులు గడుస్తున్నా ఆమె నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో కంగారుపడి భార్యకు ఫోన్ చేశాడు. త్వరలో వస్తాను అని చెప్పిందే గానీ.. ఇంటికి మాత్రం రాలేదు. తర్వాత ఫోన్ కూడా స్విఛాప్ అని వచ్చింది. అనుమానం వచ్చి ఇంట్లో పరిశీలించగా రూ.20వేల నగదు, నగలు కనిపించలేదు. ఆమె వివరాల గురించి తెలుసుకోవాలని ఆధార్ కార్డు పరిశీలించగా.. అందులో ఆమెకు సంబంధించిన ఎలాంటి వివరాలూ లేవు. ఫోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-14T21:55:55+05:30 IST