Abn logo
Sep 27 2021 @ 19:00PM

పాము కాటు వల్లే నా పదేళ్ల కొడుకు చనిపోయాడని బోరున విలపిస్తున్న ఆమెను చూసి అనుమానం.. ఆరా తీస్తే. .

ఇంటర్నెట్ డెస్క్: అప్పటి వరకూ బాగానే ఆడుకుంటూ ఉన్న ఓ 10ఏళ్ల బాబు.. ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యాడు. వాంతులు చేసుకుంటున్న ఆ బాబును చూసి.. తొలుత కుటుంబ సభ్యులు పడనిది తినడం వల్ల వాతులవుతున్నాయేమో అనుకున్నారు. అవి ఎంతకీ తగ్గకపోవడంతో.. ఏం జరిగిందో అని ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ బాబు.. చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయాడు. విషం కారణంగా బాబు ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు తేల్చేశారు. దీంతో అందరి కళ్లూ బోరున విలపిస్తున్న ఆమెపైనే పడ్డాయి. అనుమానంతో ప్రశ్నిస్తే.. తనకేం తెలియదంటూ నమ్మబలికింది. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో నిజాలను బయటపెట్టింది.


గ్వాలియర్‌కు చెందిన రాజు మిర్థా (37)అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం సీమా అనే మహిళతో వివాహమైంది. ఈ దంపతులు నితిన్ మిర్థా అనే అబ్బాయికి జన్మనిచ్చారు. ఈ క్రమంలో సీమా నాలుగు సంవత్సరాల క్రితం ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో ప్రాణాలు కోల్పోయింది. దీంతో రాజు.. 2019 డిసెంబర్‌లో జూలీ (32) అనే మరో మహిళను వివాహమాడాడు. కాగా.. నితిన్‌కు సంబంధించిన డబ్బుపై కన్నేసిన జూలీ.. అతడిని చంపేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23న అన్నంలో విషం కలిపి తన ప్రణాళికను అమలు పరిచింది. విషం కలిపిన అన్నం తిన్న నితిన్.. వాంతులు చేసుకుంటూ అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈనెల 24న ప్రాణాలు కోల్పోయాడు. బలమైన విషం వల్లే నితిన్ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు వెల్లడించారు. దీంతో జూలీ తప ఫర్ఫామెన్స్‌ను మొదలు పెట్టింది. పాము కాటుకు గురై నితిన్ ప్రాణాలు కోల్పొయి ఉంటాడేమో అంటూ విలపించడం ప్రారంభించింది. అయితే విషం వల్లే నితిన్ చనిపోయాడని చెప్పడంతోనే కుటుంబ సభ్యుల కళ్లన్నీ జూలీపై పడ్డాయి. ఆమె.. బాబును ఏదో చేసిందని అనుమానించారు. 


ఈ క్రమంలో జూలీని నిలదీస్తే తనకు ఏ పాపం తెలియదని నమ్మబలికింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తమ స్టైల్‌లో జూలీని విచారించారు. దీంతో ఆమె నిజాలను బయటపెట్టింది. సీమా మరణించిన తర్వాత ఆమె ఇన్సురెన్స్ డబ్బులు నితిన్‌పేరుపైకి ట్రాన్స్‌ఫర్ అయ్యాయని.. ఫిక్సిడ్ డిపాజిట్ రూపంలో నితిన్‌ బ్యాంకు ఖాతాలో రూ. 18లక్షలు ఉన్నాయని తెలిపింది. నితిన్‌ను చంపేస్తే ఆ డబ్బులు తన సొంతం అవుతాయని భావించి.. అన్నంలో విషం పెట్టినట్లు చెప్పింది. ఈ క్రమంలో స్పందించిన రాజు.. నితిన్ పేరుపై ఉన్న డబ్బుల్లో కొంత మొత్తం తనకు కావాలని గతంలో పలుమార్లు జూలీ తనను అడిగేదని గుర్తు చేసుకున్నాడు. అయితే దానికి తాను నిరాకరించినట్లు చెప్పాడు. డబ్బు కోసం ఇంత దారుణానికి పాల్పడుతుందని ఊహించలేదని వాపోయాడు. కాగా.. జూలీపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...