కొత్త మోడల్‌లో Ducati SuperSport బైక్

ABN , First Publish Date - 2021-09-08T00:00:33+05:30 IST

కొత్త మోడల్‌లో Ducati SuperSport బైక్

కొత్త మోడల్‌లో Ducati SuperSport బైక్

న్యూఢిల్లీ: ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి ఇండియా తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో కొత్త బైక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. 2021 డుకాటి సూపర్‌స్పోర్ట్ 950 బైక్‌లను భారత మార్కెట్‌లో సెప్టెంబర్ నెల 9వ తేదీన విడుదల చేయనున్నట్లు డుకాటి ఇండియా పేర్కొంది. గత సంవత్సరం చివర్లో ప్రపంచవ్యాప్తంగా 2021 డుకాటి సూపర్‌స్పోర్ట్ 950 మోటార్ సైకిళ్లను విడుదల చేసినట్లు సంస్థ తెలిపింది. బైక్‌ల ధరలను మాత్రం సంస్థ ఇంకా ప్రకటించలేదు.

Updated Date - 2021-09-08T00:00:33+05:30 IST