అపహరణకు గురైన బాలుడు సురక్షితం

ABN , First Publish Date - 2022-01-21T04:24:42+05:30 IST

రెండు రోజుల క్రితం చిత్తూరు నగరం కట్టమంచిలో అపహరణకు గురైన ఏడు నెలల బాలుడు(అశ్విన్‌)ను పోలీసులు సురక్షితంగా రక్షించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

అపహరణకు గురైన బాలుడు సురక్షితం
నిందితురాలిని మీడియాకు చూపుతున్న పోలీసులు

నిందితురాలి అరెస్టు


చిత్తూరు, జనవరి 20: రెండు రోజుల క్రితం చిత్తూరు నగరం కట్టమంచిలో అపహరణకు గురైన ఏడు నెలల బాలుడు(అశ్విన్‌)ను పోలీసులు సురక్షితంగా రక్షించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. సీఐ నరసింహరాజు కథనం మేరకు... కట్టమంచిలో వెంకటేశ్వర్‌ కుటుంబం నివాసముంటోంది. బుధవారం వెంకటేశ్వర్‌ భార్య తన కుమారుడు అశ్విన్‌ను ఇంట్లోని హాల్‌లో పడుకోబెట్టి బయటికి వెళ్లింది. తిరిగి వచ్చేసరికి కుమారుడు కనపడలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం చిత్తూరు రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశా రాష్ట్రం బలంగీర్‌కు చెందిన రంగీలా(40)ను అదుపులోకి తీసుకుని విచారించారు. చిన్నపిల్లలను అపహరించి వేరే ప్రాంతాల్లో భిక్షాటన కోసం ఉపయోగించుకుంటున్నట్లు విచారణలో అంగీకరించింది. దీంతో నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని పట్టుకోవడానికి కృషి చేసిన ఎస్‌ఐ అనిల్‌కుమార్‌, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ చెప్పారు. 

Updated Date - 2022-01-21T04:24:42+05:30 IST