Abn logo
Mar 1 2021 @ 23:53PM

కొనుగోలు కేంద్రాల ఎత్తివేత సరికాదు

పుట్ట మధును పదవి నుంచి తొలగించాలి : ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌/ఏర్గట్ల, మార్చి 1: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఎత్తివేస్తామనడం సరికాదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్‌తో పాటు ఏర్గట్ల మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలను ఎత్తివేయమని సీఎం కేసీ ఆర్‌ వెంటనే ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలకు టీఆర్‌ఎ స్‌ మద్దతు పలుకుతోందని అన్నారు. అలాగే, ఎస్సారెస్పీ లీకేజీ నీటిని విడుదల చే యాలని, మూడేళ్ల క్రితం ఆయకట్లు రైతులు అడిగితే కేసులు బనాయించి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసులు ఎత్తివేశామని చెప్పి.. తీరా గెలిచాక, కేసులు ఇంకా ఉన్నాయని పోలీస్‌ స్టేషన్‌కు రావాలనడం సరైంది కాదన్నారు. రైతులపై ఉన్న కేసు లను వెంటనే ఎత్తివేయాలన్నారు. హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణిల హత్యతో సంబంధం ఉన్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధును వెంటనే పద వి నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ హత్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉందా అనే సందేహం కలుగుతోందన్నా రు. దీనిని జాతీయ బార్‌కౌన్సిల్‌ సైతం ఖండించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పం దించకపోవడం దారుణమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ జి ల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్‌, మండల అధ్యక్షుడు సోమ దేవరెడ్డి, జి ల్లా కాంగ్రెస్‌ రైతు ఉపాధ్యక్షుడు ఆడెం గంగాప్రసాద్‌, గడ్డం జీవన్‌, పన్నాల నర్సా రెడ్డి, బద్ధం లింగారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement