Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లికి తిరస్కరించిందని కిడ్నాప్ చేశాడు.. స్నేహితుడి ఎదురుగానే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. అనంతరం..

ఆమెను కొద్ది రోజులుగా తన క్లాస్‌మేట్ ప్రేమ అంటూ వేధిస్తున్నాడు.. పెళ్లి చేసుకుందామని వెంట పడుతున్నాడు.. అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పింది.. దీంతో ఆమెను అతడు కిడ్నాప్ చేశాడు.. తన రూమ్‌కు తీసుకెళ్లి స్నేహితుడి ఎదురుగానే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. స్నేహితుడు ఆ ఘటనను వీడియో తీశాడు.. ఆ వీడియోతో బాధిత మహిళను నిందితుడు వేధిస్తున్నాడు.. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 


రాజస్థాన్‌లోని అళ్వార్‌కు చెందిన బాధిత మహిళను ఆమెతో పాటు చదువుతున్న షరీఫ్ అనే వ్యక్తి కొద్ది రోజులుగా ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్నాడు. అయితే షరీఫ్‌ను ఆ యువతి నిరాకరించింది. దీంతో ఆమెపై షరీఫ్ కోపం పెంచుకున్నాడు. ఆమెను షరీఫ్ గతేడాది నవంబర్‌లో కిడ్నాప్ చేసి తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే షరీఫ్ స్నేహితుడు యూసఫ్ ఉన్నాడు. యూసఫ్ ఎదురుగానే యువతిపై షరీఫ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. యూసఫ్ ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోతో బాధిత మహిళను షరీఫ్ వేధించడం ప్రారంభించాడు.


ఆ వీడియో డిలీట్ చేస్తానని చెప్పి బాధిత యువతిని షరీఫ్ తన రూమ్‌కు పిలిపించుకుని మరోసారి అత్యాచారం చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. షరీఫ్‌పై, అతడి స్నేహితుడు యూసఫ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారిద్దరినీ పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement