Abn logo
Sep 10 2021 @ 20:30PM

నిందితుడికి ఉరిశిక్ష వేయాలి

హైదరాబాద్‌: నగరంలో సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచారం ఘటన బాధాకరమని జనసేన నేత శంకర్‌గౌడ్ అన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని జనసేన నేత శంకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. 

నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన గురువారం సాయంత్రం 5 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..పొట్టకూటి కోసం నల్గొండ జిల్లా నుంచి నగరానికి వలస వచ్చింది ఆ బాలిక కుటుంబం. ఇంట్లో ఆడుతూ..పాడుతూ..కనిపించిన బాలిక గంటల తరబడి కంటకనిపించలేదు. సాయంత్రం అయినా చిన్నారి కనిపించకపోవడంతో బాలిక ఆచూకీ కోసం 2 గంటలపాటు తల్లిదండ్రులు వెతికినా లభించలేదు. దీంతో చిన్నారి ఇంటి పక్కనే ఉండే రాజుపై అనుమానంతో అర్ధరాత్రి 12 గంటలకు రాజు ఇంట్లో చూడగా చిన్నారి మృతదేహం లభ్యమైంది. చిన్నారి బాలికపై అత్యాచారం చేసి నిందితుడు హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు.