ఆల్‌టైమ్‌ హిట్‌ ఐఫోన్‌ 12

ABN , First Publish Date - 2021-01-30T05:39:23+05:30 IST

యాపిల్‌ ప్రొడక్ట్‌ ‘ఐఫోన్‌ 12’ అమ్మకాల్లో ఆల్‌టైమ్‌ హిట్‌ సాధించింది. దీని కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగింది.

ఆల్‌టైమ్‌ హిట్‌ ఐఫోన్‌ 12

యాపిల్‌ ప్రొడక్ట్‌ ‘ఐఫోన్‌ 12’ అమ్మకాల్లో ఆల్‌టైమ్‌ హిట్‌ సాధించింది. దీని కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగింది. యాపిల్‌ మూడో క్వార్టర్‌ ఫలితాలను విశ్లేషిస్తే యాపిల్‌ ఆదాయం 111.4 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.ఈ ఏడాది మొత్తమ్మీద 21 శాతం ఎదుగుదల కనిపించింది.  ఇప్పటివరకూ ఒక క్వార్టర్లో వంద బిలియన్‌ డాలర్ల రెవెన్యూ సాధన అనే పెద్ద హర్డిల్‌గా ఉండేది. ఇప్పుడూ దాన్నీ అధిగమించి యాపిల్‌ రికార్డు నెలకొల్పింది.


యాపిల్‌ ప్రతిష్ఠాత్మక ఉత్పతి ఐఫోన్‌ 12 ఈ రెవెన్యూ పెరుగుదలకు దోహదపడింది. గడచిన చివరి క్వార్టర్‌లో ఐఫోన్‌ మీద వచ్చిన ఆదాయం 65.5 బిలియన్‌ డాలర్లు. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో ఆదాయం 56 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఐఫోన్‌ 12 అమ్మకాల వివరాలు వెల్లడించనప్పటికీ ఇది హిట్‌ అని మార్కెట్లో అమ్మకాల సంఖ్యే చెబుతోంది. 


Read more