శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ బలగాలు కీలకం

ABN , First Publish Date - 2021-10-23T05:13:42+05:30 IST

అత్యవసర సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ బలగాలు అత్యంత కీలకమైనవని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మోటార్‌ ట్రాన్స్‌ఫోర్టు, పరిపాలన, డాగ్‌స్క్వాడ్‌, బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌, వాటర్‌ప్లాంట్‌, హోంగార్డు, పోలీసు స్టోర్‌, ఆయుధ భాండాగారం తదితర విభాగాల్లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు.

శాంతిభద్రతల పరిరక్షణలో సాయుధ బలగాలు కీలకం
డాగ్‌స్క్వాడ్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రాజేశ్‌చంద్ర

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 22: అత్యవసర సమయాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ బలగాలు అత్యంత కీలకమైనవని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. శుక్రవారం స్థానిక పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మోటార్‌ ట్రాన్స్‌ఫోర్టు, పరిపాలన, డాగ్‌స్క్వాడ్‌, బాంబు డిస్పోజల్‌ స్క్వాడ్‌, వాటర్‌ప్లాంట్‌, హోంగార్డు, పోలీసు స్టోర్‌, ఆయుధ భాండాగారం తదితర విభాగాల్లో ఎస్పీ తనిఖీలు చేపట్టారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సాయుధ పోలీసు అధికారులు ఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి స్వాగతించారు. అనంతరం ప్రతి విభాగానికి వెళ్లి పని తీరును, దస్ర్తాలు, పెండింగ్‌లో ఉన్న ఫైల్‌లు, రిజిస్ట్రర్‌లు తదితర వాటిని క్షుణంగా పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజాప్రతినిధుల, పోలీసు అధికారుల సెక్యూరిటీ, వీఐపీల బందోబస్తు, బహిరంగ సభలు, వివిధ జిల్లాల నుంచి రిమాండ్‌ ఖైదీలకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ప్రధానమైన విధులను సాయుధ పోలీసులు చేపడుతుంటారన్నారు. దొంగతనాలు, ఇతర పెద్ద నేరాలు జరిగినప్పుడు ఘటనా స్థలంలో పోలీసు జాగిలాలు క్షుణంగా తనిఖీ చేపట్టి నిందితులను వాసన ద్వారా పసిగట్టే ప్రయత్నం చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వినోద్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ విజయ్‌కుమార్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు వేణు, సుధాకర్‌రావు, ఇతర పోలీసు అధికారులు,డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జి రమేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2021-10-23T05:13:42+05:30 IST