Abn logo
Sep 23 2021 @ 00:36AM

కళలు ప్రజా చైతన్యం కోసమే

మాట్లాడుతున్న మాదాల రవి

మాదాల రవి


కొత్తపట్నం(ఒంగోలునగరం), సెప్టెంబరు 22: కళలు ప్ర జాచైతన్యం, సమాజ మార్పు కోసమని సినీనటుడు మాదా ల రవి పేర్కొన్నారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌ ప్రారంభించిన నేపథ్యంలో బుధవారం రాత్రి కొత్తపట్నంలో ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభ లో మాదాల రవి మాట్లాడుతూ ప్రజా చైతన్యానికి ప్రజానా ట్యమండలి నిరంతరం కృషి చేస్తుందన్నారు. ప్రజాకళాకా రుడు, సినీనటుడు దివంగత మాదాల రంగారావు కూడా జ న చైతన్యం కోసమే పనిచేశారని ఈ సందర్భంగా గుర్తు చే శారు. ఆయన పేరుతో కొత్తపట్నంలో కళావేదిక నిర్మించటం అభినందనీయమని  పేర్కొన్నారు. అనంతరం కళా వేదికను రవి ప్రారంభించారు. అనంతరం గని, చంద్రనాయక్‌, జాన కిరామ్‌ బృందం పాడిన పాటలు ఆకట్టుకున్నాయి.