ఎంపీ అరవింద్‌పై దాడి అమానుషం

ABN , First Publish Date - 2022-01-28T04:54:48+05:30 IST

ఎంపీ అరవింద్‌పై దాడి అమానుషం

ఎంపీ అరవింద్‌పై దాడి అమానుషం
కులకచర్ల : రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న నాయకులు, మాట్లాడుతున్న బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌

  • బీజేపీ నాయకులు 
  • దాడిని ఖండిస్తూ నిరసన 
  • నిందితులను అరెస్టు చేయాలంటూ డిమాండ్‌

కులకచర్ల/కొడంగల్‌/దౌల్తాబాద్‌/నవాబుపేట/ బంట్వారం/ పెద్దేముల్‌/ ధారూరు/మర్పల్లి , జనవరి 27 : ఎంపీ అరవింద్‌, బీజేపీ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని బీజేపీ వికారాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్యగౌడ్‌ తెలిపారు. గురువారం ఎంపీ అరవింద్‌పై దాడికి నిరసనగా కులకచర్లలో బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు మైపాల్‌, మోనాచారి, రామక్రిష్ణ, శ్రీనివాస్‌, భీమయ్య, బిచ్చన్న తదితరులు పాల్గొన్నారు. అలాగే కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నాయకులు పూనంచంద్‌ లాహోటి, కె.చంద్రప్ప, కూర వెంకటయ్య, కుండ్రు నర్సిములు, అశోక్‌, మొగులప్ప, వెంకటేశ్‌, మోహన్‌రెడ్డి, రాజశేఖర్‌, అశోక్‌, రవి, సంజీవ, వెంకటప్ప, మల్లేశ్‌, రాజు, రమేశ్‌, శివకుమార్‌, ప్రవీణ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. ఎంపీపై దాడిని నిరసిస్తూ చేవెళ్ల నియోజకవర్గ బీజేపీ సీనియర్‌ నాయకుడు సింగపురం రమేష్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు నవాబుపేట మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. బీజేపీ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడు రవీందర్‌, సోషల్‌ మీడియా జిల్లా కన్వీనర్‌ ప్రభాకర్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, విఠల్‌, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి, సోషల్‌ మీడియా కన్వీనర్‌ శివప్రభు, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి శ్రీహరిగౌడ్‌, హన్మంత్‌, సీనియర్‌ నాయకులు విజయ్‌, పాండు, సతీష్‌, మాణిక్యం, చంద్రకాంత్‌, శ్రీకాంత్‌, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ అరవింద్‌పై దాడికి నిరసగా బంట్వారం మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు మహేష్‌యాదవ్‌ ఆధ్వర్యంలో నాయకులు రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. నాయకులు మల్లేషం, శేఖర్‌, నవీన్‌, సుబ్బు, రాజు, సిద్ధార్థ, వెంకట్‌ తదితరులు ఉన్నారు. అలాగే దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను వెంటనే అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించాలని, లేకపోతే తాము కూడా గ్రామాల్లోకి వచ్చే ఎమ్మెల్యేలను అడ్డుకుంటామని బీజేపీ పెద్దేముల్‌ మండల శాఖ అధ్యక్షుడు సందీ్‌పకుమార్‌ డిమాండ్‌ చేశారు. పెద్దేముల్‌ మండల కేంద్రంలో నాయకులతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మండల ప్రధాన కార్యదర్శి హరీ్‌షగౌడ్‌, ఉపాధ్యక్షులు రాము, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రమేష్‌, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం సోషల్‌మీడియా కన్వీనర్‌ మారుతి, యాదయ్య, శంకర్‌జీ, నరేందర్‌, ఆనంద్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దాడిని ఖండిస్తూ బీజేపీ మండల నాయకులు ధారూరులో నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీ అర్వింద్‌పై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ గుండాలతో దాడి చేయించటం దుర్మార్గ చర్య అని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర  అదనపు కార్యదర్శి వివేకానందరెడ్డి, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రవీందర్‌గౌడ్‌, నాయకులు ఎం.రమేశ్‌, కృష్ణ, రఘుపతి, శ్రీనివాస్‌, శివ, అనిల్‌, సంతోష్‌, రవీందర్‌, సుధాకర్‌ తదితరులున్నారు. ఎంపీపై దాడిని నిరసిస్తూ మర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు మల్లేష్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి మర్పల్లి కొత్త బస్టాండు వరకు జీవన్‌రెడ్డి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, శ్రీమంత్‌కుమార్‌, జైపాల్‌, శ్రీకాంత్‌, రాఘవేందర్‌, మహేందర్‌, విక్రాంత్‌రెడ్డి, మధు, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T04:54:48+05:30 IST