ప్రతిపక్ష నాయకుని ఇంటిపై దాడి అమానుషం

ABN , First Publish Date - 2021-09-19T05:22:50+05:30 IST

ప్రతిపక్ష నాయకుని ఇంటిపై దాడి అమానుషం

ప్రతిపక్ష నాయకుని ఇంటిపై దాడి అమానుషం
విలేఖరులతో మాట్లాడుతున్న నిమ్మక జయకృష్ణ

పాలకొండ : ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని ఆ పార్టీ పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ అన్నారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... వైసీపీ నిరంకుశ పాలనకు ఇది నిదర్శమన్నారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే దాడులకు దిగడం దారుణమ న్నారు. చంద్రబాబు వంటి  వ్యక్తులకే రక్షణ లేనప్పుడు సామాన్యల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో అరకు పార్లమెంట్‌ తెలుగు యువత అధ్యక్షుడు వారాడ సుమంత్‌నాయుడు, పాలకొండ పట్టణ పార్టీ అధ్యక్షుడు గంటా సంతోష్‌కుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు గండి రామినాయుడు, గుమ్మిడి సింహాద్రి పాల్గొన్నారు. 



 

Updated Date - 2021-09-19T05:22:50+05:30 IST