నవ్య కవిత్వ ప్రతీక హిప్నలిపి

ABN , First Publish Date - 2021-10-18T06:01:35+05:30 IST

హిప్నలిపి అనే పేరులో ఎంత నవ్యత్వం ఉందో ఆ పుస్తకంలోని కవి త్వంలో ప్రతి అక్షరంలోనూ కొత్తదనం కనిపిస్తుందని ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు పేర్కొ న్నారు. ఒంగోలులోని కాకతీయ సేవాసమాఖ్య కార్యాలయంలో ఆదివారం జరిగిన సాహితీ సదస్సులో ఆయన హిప్నలిపి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

నవ్య కవిత్వ ప్రతీక హిప్నలిపి
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న ఈదర హరిబాబు, సాహిత్యవేత్తలు

ఒంగోలు(కల్చరల్‌), అక్టోబరు 17: హిప్నలిపి అనే పేరులో ఎంత నవ్యత్వం ఉందో ఆ పుస్తకంలోని కవి త్వంలో ప్రతి అక్షరంలోనూ కొత్తదనం కనిపిస్తుందని ఎన్టీఆర్‌ కళాపరిషత్‌ చైర్మన్‌ ఈదర హరిబాబు పేర్కొ న్నారు. ఒంగోలులోని కాకతీయ సేవాసమాఖ్య కార్యాలయంలో ఆదివారం జరిగిన సాహితీ సదస్సులో ఆయన హిప్నలిపి పుస్తకాన్ని ఆవిష్కరించారు.  పుస్తక రచయిత ఉప్పలపాటి వెంకటరత్నం మంచి సాహిత్యవేత్త మా త్రమే కాకుండా మంచి నటుడు కూడా అని ఆయన కొనియాడారు. అనంతరం పుస్తక రచయితను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నరసం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు తేళ్ల అరుణ బీరం సుందరరావు, నాగభైరవ సా హిత్యపీఠం అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ, భువనగిరి పురుషోత్తం, కుర్రా ప్రసాద్‌బాబు, కె.బాలకృష్ణారె డ్డి, మిడసల మల్లిఖార్జునరావు, అన్నమనేని ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-18T06:01:35+05:30 IST