బార్లు ఓపెన్‌..నేటి నుంచి తెరుచుకోనున్న బార్లు, క్లబ్బులు

ABN , First Publish Date - 2020-09-26T11:05:40+05:30 IST

బార్లు, క్లబ్బులు, తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు నియమ నిబంధనలతో కూడిన జీవోను శుక్రవారం

బార్లు ఓపెన్‌..నేటి నుంచి తెరుచుకోనున్న బార్లు, క్లబ్బులు

జీఓ జారీ చేసిన ప్రభుత్వం


మంచిర్యాల, సెప్టెంబరు 25: బార్లు, క్లబ్బులు,  తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు నియమ నిబంధనలతో కూడిన జీవోను శుక్రవారం జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో బార్ల యజమానులకు ఊరట లభించినట్లయింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆరు నెలలుగా బార్లు నిరవధికంగా మూత పడ్డాయి. వైరస్‌ విస్తరణను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ప్రజలు గు మిగూడే అవకాశం ఉన్నందున వైన్‌షాపులు, బార్లు, క్లబ్బులు, పాఠశాలలు, గుళ్లు, బస్సులు, రైళ్లు, విమా నాలను రద్దు చేసింది. కొద్ది రోజులు గడిచే సరికి వైన్‌ షాపులు, గుళ్లు, బస్సులు, రైళ్లు, విమానాల రాకపోకల ను పునరుద్ధరించిన ప్రభుత్వం తాజాగా బార్లు, క్లబ్బు లు తెరిచేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కొవిడ్‌ నిబం ధనలు పాటిస్తూ నడుపుకొనేందుకు అనుమతుల ఇవ్వగా తక్షణమే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే పర్మిట్‌ రూంలకు మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.


జిల్లాలో  బార్లు

జిల్లా వ్యాప్తంగా ఎనిమిది బార్లు ఉండగా శనివా రం నుంచి తెరుచుకోనున్నాయి. అయితే లాక్‌డౌన్‌ సం దర్భంగా ఆరు నెలలపాటు మూసి ఉండటంతో వాటి ని శుభ్రపరచడం, స్టాక్‌ ఏర్పాటు చేసుకోవడం లాంటి పనుల కారణంగా ఒకటి రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాలో మొత్తం ఎనిమిది బార్లు ఉండగా జిల్లా కేంద్రంలో ఆరు, బెల్లంపల్లి, నస్పూర్‌ ఒకటి చొప్పున ఉన్నాయి. నస్పూర్‌ నూతనంగా ఏర్పాటైన ఎలైట్‌ బార్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, లాక్‌డౌన్‌ కారణంగా ప్రా రంభానికి నోచుకోలేదు. 


బార్లలో నో స్టాక్‌...?

జిల్లా వ్యాప్తంగా బార్లలో ప్రస్తుతం మద్యం నిల్వ లు నిండుకున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ సందర్భంగా వైన్‌ షాపులు బంద్‌ ఉన్న సమయంలో మద్యం లభించక మందు బాబులు తీవ్ర అవస్థలు పడ్డారు. మందు బాబుల అవసరాన్ని గుర్తించిన బార్ల నిర్వా హకులు అనధికారికంగా మద్యాన్ని బయటకు తర లించి, అధిక రేట్లకు విక్రయించినట్లు ప్రచారం జరుగు తోంది. ఇలా మద్యం బయటకు వెళ్లడంతో నో స్టాక్‌ కారణంగా శనివారం బార్లలో మద్యం దొరికే అవకా శాలు తక్కువ. శనివారం డీడీలు తీసి, స్టాకు తెప్పిస్తే సాయంత్రం బార్లలో మద్యం లభించే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2020-09-26T11:05:40+05:30 IST