బార్లు ఓపెన్‌

ABN , First Publish Date - 2020-09-26T10:58:17+05:30 IST

కరోనా వ్యాధి నేపథ్యంలో మూతపడ్డ బార్‌షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ శుక్రవారం

బార్లు ఓపెన్‌

పర్మిట్‌ రూంలకు నో...

కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశాలు 


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరోనా వ్యాధి నేపథ్యంలో మూతపడ్డ బార్‌షాపులు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ శుక్రవారం అనుమతి ఇచ్చారు. బార్లు తెరుస్తున్న నేపథ్యంలో పాటించా ల్సిన కొవిడ్‌ నిబంధనలను కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నా రు. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాపులకు అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూంలను తెరిచేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతించలేదు. అలాగే మద్యం బార్‌లలో సంగీత కచేరీలు, డ్యాన్సులు నిర్వహించడాన్ని నిషేధించినట్లు ప్రభు త్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. బార్‌షాపుల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌ ఏర్పాటునుకానీ, ఇన్‌ఫ్రారెడ్‌ థర్మా మీటర్లతో పరీక్షలుగానీ నిర్వహించాలని, క్యూ పద్ధతి పాటించాలని ఆదేశించారు. పార్కింగ్‌ స్థలాలలో గుమికూడ కుండా చూడాలని, బార్‌లలో హ్యాండ్‌ సానిటైజర్లను ఏర్పా టు చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిబ్బంది విధిగా మాస్కులు ధరించాలని, బార్‌ ఆవరణలో ఉదయం, సాయంత్రం శుభ్రపరిచి సానిటైజేషన్‌ చేయించాలని పేర్కొ న్నారు.


బార్‌లో ఒక కస్టమర్‌ వెళ్లిపోగానే ఆ టేబుల్‌, కుర్చీలను పూర్తిస్థాయిలో సానిటైజ్‌ చేయాలని, వెంటిలేషన్‌ సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఏర్పాట్లు చేసుకు న్న వెంటనే ఒకటి, రెండు రోజుల్లో జిల్లావ్యాప్తంగా అన్ని బార్‌లను తెరువనున్నారని సమాచారం. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 66 బార్లు తెరుచుకోనున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 29, పెద్దపల్లి జిల్లాలో 14, జగిత్యాల జిల్లాలో 16, రాజన్న సిరిసిల్లజిల్లాలో 7 బార్లు ఉన్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 3సార్లు సవరించిన నేపథ్యంలో గతంలోనే బార్లు ఓపెన్‌ చేస్తారని ఆశించారు. ఇప్పుడు బార్లు తెరుచుకోనుండగా ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 266 పర్మిట్‌ రూంలకు మాత్రం తెరిచే అవకాశం లేకుండా పోయింది. 

Updated Date - 2020-09-26T10:58:17+05:30 IST