కొత్త చరిత్రకు శ్రీకారం

ABN , First Publish Date - 2020-10-31T05:56:39+05:30 IST

విశ్వవిద్యాలయాల్లో గురుశిష్యుల బంధం కూడా కాలంతో పాటు మారుతూ రావటం గమనిస్తున్న విషయమే. రోజురోజుకి అవసరమే...

కొత్త చరిత్రకు శ్రీకారం

విశ్వవిద్యాలయాల్లో గురుశిష్యుల బంధం కూడా కాలంతో పాటు మారుతూ రావటం గమనిస్తున్న విషయమే. రోజురోజుకి అవసరమే కేంద్రంగా సాగుతున్న వ్యవహారాలలో కులం, మతం, ప్రాంతం కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో వంద మందికి పైగా విద్యార్థులు తమ గురువు పదవీ విరమణ చేస్తున్న రోజున, ఆయన పేరు మీద విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక బంగారు పతకాన్ని ఏర్పాటు చేయడం విశేషం. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం కంట్రోలర్‌గా నేడు పదవీ విరమణ చేస్తున్న ప్రొఫెసర్‌ రావూరి వీర రాఘవయ్య గతంలో బాపట్ల వ్యవసాయ కళాశాల ఆగ్రానమీ విభాగంలో 25 ఏళ్ల పాటు పని చేశారు. ఆ కాలంలో ఆ విభాగంలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసిన విద్యార్ధులు ఆయన పదవీ విరమణ సందర్భంగా గురువు మీద గౌరవాభిమానాలతో ఈ బంగారు పతకం ఏర్పాటు చేయడం హర్షణీయం. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విద్యాలయం ఏర్పాటైన 1964 నుంచి ఏ ప్రొఫెసర్‌కు ఇటువంటి గౌరవం దక్కలేదు. 75సంవత్సరాల బాపట్ల వ్యవసాయ కళాశాల చరిత్రలో కూడా ఇటువంటిది జరగలేదు. ఆగ్రానమీ చదువుకున్న పూర్వ విద్యార్థులు చూపిన గురుభావం వారి స్ఫూర్తి ప్రస్తుత పరిస్థితులలో అన్ని విశ్వవిద్యాలయాల్లో వెల్లివిరియాల్సిన అవసరముంది.

వి.గోపీచంద్‌

Updated Date - 2020-10-31T05:56:39+05:30 IST