యుగారంభం ఉగాది

ABN , First Publish Date - 2021-04-14T05:26:58+05:30 IST

యుగ ఆరం భమే ఉగాది అని, హిందువులు తెలుగు సంవత్సరాదిని ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, పంచాంగ శ్రవ ణం చేయడం వంటి కార్యక్రమాలతో ఆలయాలు కిటకిటలాడాయి.

యుగారంభం ఉగాది
గండిలో జరుగుతున్న అంజన్న గ్రామోత్సవం

ఒంటె వాహనంపై ఊరేగిన గండి అంజన్న - ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

పంచాంగ శ్రవణం - శిల్పారామంలో అలరించిన నృత్యాలు

వేంపల్లె/చక్రాయపేట/వేముల/ఖాజీపేట/ పులివెందులరూరల్‌/మైదుకూరు/ బి.మఠం/బద్వేలు/ బద్వేలు రూరల్‌/ పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 13: యుగ ఆరం భమే ఉగాది అని, హిందువులు తెలుగు సంవత్సరాదిని ప్రత్యేకంగా వేడుకలు చేసుకుంటారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, పంచాంగ శ్రవ ణం చేయడం వంటి కార్యక్రమాలతో ఆలయాలు కిటకిటలాడాయి. గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో ఉద యం నుంచి ప్రత్యేక పూజలు చేసి రాత్రి స్వామి వారిని ఒంటె వాహనంపై ఊరే గించారు.

వేంపల్లె గాండ్లవీధిలోని శ్రీవల్లీ దేవ సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వా మి దేవస్థానంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వృషభాచలేశ్వ ర స్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వా మి, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యే క పూజలు నిర్వహించారు. సాయంత్రం పంచాంగ శ్రవణం నిర్వహించారు.  ఆల య ఈఓ ప్రతాప్‌, చైర్మన జయచంద్రా రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.

చక్రాయపేట లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో దేవస్థాన చైర్మన తంగెడుపల్లె ఓబుళరెడ్డి ఆధ్వర్యంలో అనంతపద్మనాభ శర్మ పం చాంగ శ్రవణం చేయించారు. గండి దేవస్థానంలో ఆంజనేయస్వామి గ్రామో త్సవం ఘనంగా నిర్వహించారు. సహా య కమిషనర్‌ అలవలపాటి ముకుంద రెడ్డి, ప్రధాన అర్చకులు కేసరి, రాజార మేష్‌ ఒంటె వాహనంతో రథాన్ని ప్రత్యే కంగా అలంకరించి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు.

గండి క్షేత్రం నుంచి రామా లయం, భూమానందాశ్రమం, వీరన్నగ ట్టుపల్లెల్లో మెరవణి జరిగింది. స్వామికి రథాన్ని బహూకరించిన సోమేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేము ల మండలంలో ఉగాది సంబరాలు ఘ నంగా నిర్వహించారు. వృత్తి రిత్యా పట్ట ణాల్లో స్థిరపడ్డవారు సొంత ఊర్లకు చేరుకుని బంధుమిత్రులతో కలిసి వేడు క చేసుకుంటున్నారు.

పులివెందుల శిల్పారామంలో ఉగాది  సందర్భంగా ఏ ర్పాటు చేసిన చిన్నారుల నృత్య ప్రదర్శన లు అలరించింది. శిల్పారామం పరిపాల న అధికారి సుధాకర్‌ సమక్షంలో సోమే పల్లె వెంకటేశ్వర శర్మచే పంచాంగ శ్రవ ణం నిర్వహించారు. శిల్పారామం సంద ర్శకులతో కిటకిటలాడింది. సాయంత్రం పులివెందుల చిన్నారుల నృత్య ప్రదర్శన లు ప్రేక్షకులను అలరించాయి.

మైదుకూ రులో ఉగాది పండుగను ఘనంగా చేసు కున్నారు. ఉదయం రైతులు ఇతర వర్గా ల వారు రంగునీళ్లు కలిపి వసంతాలు చల్లుకుంటూ సంబరాలు చల్లుకున్నారు. పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు.  పోలీస్‌ సిబ్బంది పచ్చకట్టులో కనిపించారు. ఖాజీపేట మండలంలో ఉగాది పండుగను ఘనంగా చేసుకున్నారు. సంప్రదాయ బ ద్దంగా యువకులు, ప్రజలు వసంతాలు పోసుకుని సంబరాలు చేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పాల్గొన్నారు.

బ్రహ్మంగారిమఠంలోని  సిద్దయ్య కుమా రుడు పెద్దపీరయ్యస్వామి ఆరాధన మ హోత్సవాలు ఘనంగా జరిగాయి. ముడ మాలలోని సిద్దయ్యగారి మఠంలో ఉగా దిన ఆరాధన మహోత్సవాలు, రాత్రి గ్రా మోత్సవం నిర్వహించారు. సిద్దయ్యస్వా మికి పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అందించిన శిఖాఉంగరం, పావుకోళ్లు, బెత్తంకర్ర, పూజా సామగ్రి వస్తువులను భక్తులు దర్శించుకున్నారు. 14న చిన్న, పెద్ద బండలాగుడు పోటీలు నిర్వహిస్తు న్నట్లు నిర్వాహకులు తెలిపారు.

బద్వేలు పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో ఉగాది వేడుకలను సంప్రదాయ బద్దంగా నిర్వ హించారు. చాలా మంది రాశిఫలాలు, గ్రహస్థితులు, పంచాంగ శ్రవణం వంటి వి టీవీల్లోనే వీక్షించారు. బద్వేలులో పోలీసులు సంప్రదాయ దుస్తులు ధరిం చారు. సమరసతా సేవా ఫౌండేషన ఆధ్వర్యంలో మడకలవారిపల్లె లో నగర సంకీర్తన  నిర్వహించారు. ప ర్వదినాల్లో దేవాలయాలను అభివృద్ధి చేసుకోవడం, సంస్కార వంతంగా జీవించడం, దైవ నామస్మరణ చేస్తూ ఆరోగ్యంగా ఆనం దంగా ఉండాలని కోరారు.

కార్యక్రమం లో మాజీ కౌన్సిలర్‌ వంకెల సుబ్బరాయు డు,  దేవాలయ ప్రముఖ్‌ వంకెల వెంక టేశ, ఫౌండేషన సభ్యులు గోపవరం మండల ధర్మ ప్రచారకులు వెంకటేశ, ఎ.వెంకటేశ పాల్గొన్నారు. పోరుమామిళ్ల మండలం రామాయపల్లెలో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వసంతాలు చల్లు కున్నా రు. డప్పువాయిద్యాలతో గ్రామంలో  యూత కమిటీ ఆధ్వర్యంలో పిల్లలు డ్యా న్సులతో, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఆనందంగా ఉత్సవాలు జరిపారు. కార్య క్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.













Updated Date - 2021-04-14T05:26:58+05:30 IST